Top
logo

'మా' బరిలో ఉన్న అభ్యర్థులకు జీహెచ్‌ఎంసీ షాక్‌

మా బరిలో ఉన్న అభ్యర్థులకు జీహెచ్‌ఎంసీ షాక్‌
X
Highlights

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడితో పాటు సభ్యుల ఎంపిక కోసం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ హోరాహోరిగా మధ్య...

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడితో పాటు సభ్యుల ఎంపిక కోసం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ హోరాహోరిగా మధ్య ముగిసింది. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌ ఎన్నికల బరిలో తలపడుతున్న నరేష్‌, శివాజీ రాజాలకు జీహెచ్‌ఎంసీ భారీ షాక్‌ ఇచ్చింది. జీహెచ్ఎంసీ నిబంధలకు విరుద్ధంగా ఫిలిం చాంబర్‌ పరిసరాల్లో మొత్తం తమ ప్లేక్సీ, పోస్టర్ల ఏర్పాటు చేసినందుకు శివాజీ రాజా, నరేష్‌లతో పాటు మరికొంత మందికి జుర్మానా వేసేందుకు సిద్ధమౌతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. కాగా ఇందులో భాగంగానే ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. తమ పై అధికారులతో మంతనాలు జరిపిన తరువాత ఎలాంటి చర్యలు తీసుకొవాలన్న విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపారు.

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ పోలింగ్‌ ఊపందుకుంది. ఫిలించాంబర్‌ దగ్గరకు ఒక్కొక్కరుగా చేరుకుంటున్న ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మాదాల రవి, జేడీ చక్రవర్తి, సునీల్, అలీ,వేణుమాధవ్, సంజన, శివపార్వతి ఓటు వినియోగించుకున్నారు. ఇక అధ్యక్షులుగా పోటీ పడుతున్న శివాజీరాజా, నరేష్‌లు ఫిలించాంబర్ దగ్గరే మకాం వేసి పోలింగ్‌ను సమీక్షిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Next Story