అందుకే వైసీపీకి రాజీనామా చేశా : ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

అందుకే వైసీపీకి రాజీనామా చేశా : ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
x
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబుతో సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గురువారం ఉదయం భేటీ అయ్యారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆదిశేషగిరిరావు...

ముఖ్యమంత్రి చంద్రబాబుతో సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గురువారం ఉదయం భేటీ అయ్యారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆదిశేషగిరిరావు త్వరలో టీడీపీలో చేరనున్నారు. వైసీపీ విధివిధానాలు నచ్చక పోవడం వల్లే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు ఆదిశేషగిరిరావు అన్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి చర్చించిన తరువాత పార్టీలో చేరే తేదిని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఆయన అన్నారు. టీడీపీ - వైసీపీల మధ్యే ఎన్నికలు జరుగుతాయన్న ఆయన చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories