Top
logo

నగరంలో మళ్లీ డ్రగ్స్‌ కలకలం...విద్యార్థులే టార్గెట్ గా మహిళ డ్రగ్స్ దందా

నగరంలో మళ్లీ డ్రగ్స్‌ కలకలం...విద్యార్థులే టార్గెట్ గా మహిళ డ్రగ్స్ దందా
X
Highlights

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్‌గా ఘనా దేశానికి చెందిన ఓ మహిళ...

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్‌గా ఘనా దేశానికి చెందిన ఓ మహిళ డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలి నుంచి 50 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని ఆమెను విచారిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లోని వ్యాపారవేత్తల పిల్లలకు, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు డ్రగ్స్‌ విక్రియంచినట్టు విచారణలో తేలింది. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం డ్రగ్స్‌ కొనుగోలు చేసిన వారందిరికీ త్వరలో నోటీసులు ఇస్తామని అధికారులు చెప్పారు. సిటీకి డ్రగ్స్‌ ఎలా తీసుకొస్తున్నారు.. ఇంకా ఎవరెవరున్నారు అని పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Next Story