శ్రీశైలం మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం

శ్రీశైలం మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం
x
Highlights

జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం‌లో శివరాత్రి సందర్భంగా మల్లన్న పెళ్ళి కుమారుడు‌గా ముస్తాబవనున్నాడు. ఈ కల్యాణ వేడుకకు చేనేత మగ్గం పై పృధ్వి వంశీయులు...

జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం‌లో శివరాత్రి సందర్భంగా మల్లన్న పెళ్ళి కుమారుడు‌గా ముస్తాబవనున్నాడు. ఈ కల్యాణ వేడుకకు చేనేత మగ్గం పై పృధ్వి వంశీయులు నేసిన నూలు వస్త్రాన్ని తలపాగాగా చుడతారు. నియమనిష్టల తో స్వామివారి తలపాగా నేసే పృథ్వీ వంశస్థులపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి రోజున స్వామివారిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు అవుతారు. ఇందులో భాగంగా మల్లికార్డునిడికి తలపాగ చుట్టిన తర్వాతే భ్రమరాంబతో పెళ్లి తంతు మొదలవుతుంది. పరమశివుణ్ని పెళ్లి కుమారుడిగా అలంకరించే వస్త్రాన్ని ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురి హస్తినాపురంలోని ఓ చేనేత కుటుంబం నేస్తుంది. ఇక్కడి పృథ్వీ వంశస్థులు వందేళ్లకు ముందు నుంచి ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. ఏటా మహా శివరాత్రిన జరిగే శ్రీశైలం మల్లన్న కల్యాణోత్సవంలో శివుణ్ని వరుడిగా అలంకరణ చేస్తారు. 150 గజాలు ఉండే ఈ వస్త్రాన్ని ఆలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ చుడతారు.

ఈ తలపాగను తయారు చేయడానికి పృథ్వీ వంశస్థులు ఏడాదంతా శ్రమిస్తారు. రోజుకు మూర చొప్పున 360 మూరలు చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. దీనిని తయారుచేసే సమయం లో ఎంతో నియమనిష్టలతో ఉపవాసాలు ఉండి ఆస్వామి వారిని స్మరించుకుంటూ తయారు చేస్తారు. పృథ్వీ వంశస్థులు ఈ తరానికి చెందిన వెంకటేశ్వర్లు కూడా ఎంతో నియమ నిబంధనలతో తలపాను నేశారు. ఈ విధంగా నేసిన తలపాగాను శివర్రాత్రి కి నాలుగు రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహించి అనంతరం శ్రీశైలం తీసుకు వెళ్తారు. శివరాత్రి రోజు జరిగే మల్లన్న కల్యాణానికి వరుడుగా తీర్చిదిద్దేందుకు తలపాగా అలంకరణ చేస్తారు.

ఈ విధంగా ఎంతో విశిష్టత కూడుకున్న ఈ వస్త్రాన్ని కల్యాణం అనంతరం వేలం వేస్తారు. దానిని దక్కించుకొనేదుకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు సైతం ఎంతో మంది పోటీ పడతారు. ఇక ఎంతో విశిష్టత కల్గిన మల్లన్న కల్యాణనికి సంబంధించిన తలపాగా తయారు చేసే అవకాశం దక్కించుకున్న పృథ్వీ వంశస్తులు మూడుతరాలకు పైగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇటువంటి అరుదైన అవకాశం దక్కడం పృథ్వీ వంశస్తులకే కాక చీరాలకు కూడా గుర్తింపు లభించిందని గ్రామస్తులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories