ప్రభుత్వ ఆస్పత్రిలో వింత శిశువు జననం

ప్రభుత్వ ఆస్పత్రిలో వింత శిశువు జననం
x
Highlights

రంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జన్యులోపం కారణంగా...

రంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జన్యులోపం కారణంగా ఒంటికాలితో ఉన్న శిశువు జన్మించింది. గురువారం ఉదయం వట్‌పల్లి మండలం పోతులబొగుడకు చెందిన సుజాత ప్రసవం కోసం రంగారెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎంసీహెచ్‌లో చేరారు. నొప్పులు రావడంతో డాక్టర్లు శస్త్రచికిత్స చేసి శిశువును బయటకు తీశారు. శిశువుకు రెండు చేతులు ఉన్నా సాగరకన్యలాగ రెండు కాళ్లు కలిపి ఒకే కాలు మాదిరి ఉన్నదని డాక్టర్ అశోక్ తెలిపారు. అయితే కాళ్ల భాగంలో చేప తోకలా ఉండి ఆడో, మగో తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉంది.

ఈ విషయమై ఆస్పత్రి పిల్లల డాక్టర్‌ అశోక్‌ ముత్కని నుంచి వివరాలు కోరగా ఆ శిశువుకు జననాంగం లేదని తెలిపారు. కాగా కొద్ది సేపటికే ఆ శిశువును హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తీసుకు వెళ్లాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. అయితే ఇలాంటి జననాలు చాలా అరుదని, ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉన్నా బతకడం చాలా కష్టమని చెప్పారు. శిశువు బరువు తక్కువగా ఉండటంతోపాటు జననేంద్రియాలు ఏవీ లేవని, సిరినోమిలియా అనే జన్యు సంబంధ లోపం వల్ల ఇలాంటి శిశువులు జన్మిస్తారని వివరించారు. కాగా వైద్యులు నిలోఫర్‌ ఆస్పత్రికి వెళ్లమని చెప్పినా కానీ నవజాత శిశువును కుటుంబ సభ్యులు సంగారెడ్డి ఆస్పత్రిలోనే ఉంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories