గౌతం గంభీర్ ప్రచారంలో డూప్ ని వాడారా?

గౌతం గంభీర్ ప్రచారంలో డూప్ ని వాడారా?
x
Highlights

ఢిల్లీలో గెలుపు కోసం ఆప్, బీజేపీ చేసిన ప్రచారాలు హద్దులు దాటిపోయాయి బీజేపీ, కాంగ్రెస్ ఒకటే నంటూ ఆప్ ఆరోపించడమే కాదు ట్విట్టర్ వేదికగా గౌతం గంభీర్...

ఢిల్లీలో గెలుపు కోసం ఆప్, బీజేపీ చేసిన ప్రచారాలు హద్దులు దాటిపోయాయి బీజేపీ, కాంగ్రెస్ ఒకటే నంటూ ఆప్ ఆరోపించడమే కాదు ట్విట్టర్ వేదికగా గౌతం గంభీర్ పరువు తీసేసింది ఈ రెండు పార్టీలు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడమే కాదు పాంపెట్ల యుద్ధం చివరకు పరువు నష‌్టం దావాకు దారి తీసింది.

ఎన్నికల ప్రచారాలు ఒక్కోసారి హద్దు మీరి వివాదాలకు తావిస్తుంటాయి. ముక్కోణపు పోటీ నెలకొన్న ఢిల్లీలో సీన్ నువ్వా నేనా అన్న రీతిన సాగుతోంది. ముఖా ముఖీ తలపడుతున్న బీజేపీ, ఆప్ ఒకరిపై ఒకరు చెలరేగి ఆరోపణలు చేసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయాయంటూ ఆప్ ప్రచారం చేయడం కలకలం రేపింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్విట్టర్లో ఓ ఫోటో షేర్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయని ట్వీట్ చేశారు. క్రికెటర్ గౌతం గంభీర్ ఎన్నికల ప్రచారంలో తనకు డూప్ గా ఓ కాంగ్రెస్ నేతను పెట్టుకున్నాడన్నారు. గంభీర్ ఏసీ కారులో హాయిగా కూర్చుంటే ఈ డూప్లికేట్ గంభీర్ ఓపెన్ లెస్ టాప్ వ్యాన్లో చెమటలు కక్కుతూ ప్రజలకు అభివాదం చేస్తున్నాడని ఆప్ ఆరోపించింది. ఎండలు తట్టుకోలేక గౌతం గంభీర్ ఇలా కాంప్రమైజ్ అయ్యాడంటూ సిసోడియా ఆరోపించారు. గౌతం గంభీర్ లా నటిస్తున్న ఆ కాంగ్రెస్ నేత పేరు గౌరవ్ అరోరా అనీ ఆయన పోస్ట్ పెట్టారు. అయితే దీన్ని గౌతం ఖండించారు. అవన్నీ అబద్ధాలనీ తాను ఎండల్లో తిరిగి ఓట్లడిగాననీ అన్నారు.

ఆప్, బీజేపీ మధ్య ఈ గొడవ కొత్తది కాదు. ఈస్ట్ ఢిల్లీ ఆప్ అభ్యర్ధి అతిషీ మీద అసభ్యకరమైన పాంపెట్లు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై కంగుతిన్న అతిషీ ప్రెస్ మీట్ పెట్టి ఇది గౌతం గంభీర్ పనేనని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇలాంటి నేతల వల్ల మహిళలకు రక్షణేదంటూ మండిపడ్డారు. అయితే తాను అలాంటి వంకర బుద్ధులున్న నేతను కాదని తీవ్రంగా స్పందించారు గంభీర్ పోటీ తట్టుకోలేక లేనిపోని కామెంట్లు చేస్తున్నారంటూ ఎదురు తిరిగారు. అంతేకాదు. దీనివెనుక అరవింద్ కేజ్రీవాల్ హస్తముందంటూ తిట్టి పోశారు. అంతేకాదు కేజ్రీ లాంటి వ్యక్తి సీఎం పదవికి అనర్హుడంటూ మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ కేజ్రీవాల్, సిసోడియా, అతిషీలపై పరువునష్టం దావా కూడా వేశారు గంభీర్ మరోవైపు గంభీర్ తనకు క్షమాపణలు చెప్పకపోతే విషయం సీరియస్ అవుతుందంటూ కేజ్రీవాల్ కూడా ఎదురు తిరిగారు. ఈ వివాదాన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు అతీషీ ఢిల్లీ అమ్మాయి కన్నీళ్లు పెట్టించిన బుద్ధిలేని అభ్యర్ధులను ఓడించండంటూ పిలుపిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories