ఆసక్తికరంగా భీమిలి అసెంబ్లీ సీటు పోరు...గంటాను ఢీ కొట్ట‌బోతున్న...

ఆసక్తికరంగా భీమిలి అసెంబ్లీ సీటు పోరు...గంటాను ఢీ కొట్ట‌బోతున్న...
x
Highlights

విశాఖ సాగరతీరంలో చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది భీమిలి అసెంబ్లీ నియెజకవర్గం. టీడీపీకి కంచుకోట అయిన ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నుంచి ఎవరూ పోటీ చేసిన...

విశాఖ సాగరతీరంలో చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది భీమిలి అసెంబ్లీ నియెజకవర్గం. టీడీపీకి కంచుకోట అయిన ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నుంచి ఎవరూ పోటీ చేసిన విజయం సాధిస్తారు అనే సెంటిమెంట్ ఉంది. అయితే, ఇటీవల రాజకీయ సమీకరణాలు మారడంతో పోరు ఆసక్తికరంగా మారింది. మంత్రి గంటాతో ఎంపీ అవంతి శ్రీనివాస్ పోటీ పడుతుండడంతో భీమిలిలో గెలుపు నీదా నాదా అన్నట్లుగా ఉంది.

విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్ గంటాను ఢీ కొట్టబొతున్నారు.

గత ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణలతో గంటా శ్రీనివాస్ రావు, ముత్యంశెట్టి శ్రీనివాస్ టీడీపీలో చేరారు. భీమిలిలో అసెంబ్లీ సీటుకు టీడీపీ నుంచి పోటీ చేసి గంటా విజయం సాధించగా, ముత్యంశెట్టి శ్రీనివాస్ అనకాపల్లి ఎంపీగా గెలిచారు. భీమిలి నుంచి తిరిగి పోటీ చేసేందుకు గంటా రెడీ అవుతుండగా, భీమిలిలో తన వ్యాపార కార్యకలాపాలు ఉండడంతో అవంతి శ్రీనివాస్ ఇక్కడే పాగా వేయాలని పట్టుదలగా ఉన్నారు. గంటా, అవంతి శ్రీనివాస్ భీమిలిని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తన శైలిలో చక్రం తిప్పి గంటా భీమిలి సీట్ ను కన్ ఫార్మ్ చేసుకోగా, ముత్యంశెట్టి శ్రీనివాస్ కు టికెట్ దక్కకపోవడంతో అతడితో కలిసి అవంతి శ్రీనివాస్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకప్పుడు గంటా, ముత్యంశెట్టి శ్రీనివాస్ ఒకే వర్గంలో ఉన్నారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న అవంతి శ్రీనివాస్ గెలుపుకు ముత్యంశెట్టి శ్రీనివాస్ కృషి చేస్తున్నారు. దీంతో భీమిలి రాజకీయ పొరు రసవత్తరంగా మారింది. వైజాగ్ లో భీమిలి సీటుపై హట్ హట్ గా చర్చ జరుగుతోంది. గంటా గెలుస్తారా, అవంతి శ్రీనివాస్ విజయం సాధిస్తారా అనేదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories