కేసీఆర్‌ ఎన్నికను రద్దు చేయాలి: హైకోర్టుకెక్కిన ఓటరు

కేసీఆర్‌ ఎన్నికను రద్దు చేయాలి: హైకోర్టుకెక్కిన ఓటరు
x
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలైంది. ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్‌ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గజ్వేల్‌ ఓటరు శ్రీనివాస్‌ హైకోర్టును...

ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలైంది. ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్‌ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గజ్వేల్‌ ఓటరు శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు. కేసీఆర్‌పై 64 క్రిమినల్ కేసులు ఉంటే 2 మాత్రమే ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారన్న శ్రీనివాస్‌ తప్పుడు సమాచారమిచ్చిన కేసీఆర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరారు.

తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్ధులు వరుసగా హైకోర్టు తలుపు తడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదంటూ కోర్టును ఆశ్రయించారు. తమపై గెలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులను అనర్హులుగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరారు. పది మందికి పైగా కాంగ్రెస్‌ నేతలు పిటిషన్లు దాఖలు చేయడంతో వాటన్నింటినీ సోమవారం విచారణ చేపట్టనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories