టీఆర్‌ఎస్ గూటికి వంటేరు ప్రతాపరెడ్డి

టీఆర్‌ఎస్ గూటికి వంటేరు ప్రతాపరెడ్డి
x
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌‌ను రెండు సార్లు ఢీకొన్న కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. ఇంతకాలం ఆయన ఎవరితో అయితే పోరాడారో ఆయన పంచకే చేరబోతున్నారు. వంటేరు ప్రతాప రెడ్డి టీఆర్‌ఎస్ లో చేరడానికి ముహూర్తం ఖరారైంది.

అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌‌ను రెండు సార్లు ఢీకొన్న కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. ఇంతకాలం ఆయన ఎవరితో అయితే పోరాడారో ఆయన పంచకే చేరబోతున్నారు. వంటేరు ప్రతాప రెడ్డి టీఆర్‌ఎస్ లో చేరడానికి ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు వంటేరు ప్రతాప రెడ్డి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. వంటేరు ప్రతాపరెడ్డి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌‌పై పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్, హరీష్ రావ్ తన ఓటమికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించి హడావిడి చేశారు. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఇంతకాలం కేసీఆర్ ప్రత్యర్థిగా ఉన్న వంటేరు ప్రతాపరెడ్డి చివరికి ఆయన పార్టీలోనే చేరుతున్నారు. గులాబీ గూటికి చేరే అంశంపై స్పందించేందుకు వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియాకు అందుబాటులో లేకపోయినా ఆయన కుమారుడు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించారు.

వంటేరు ప్రతాప రెడ్డి సిద్దిపేట జలాల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఏకైక బలమైన నేత. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తూ బలమైన నేతలగా పేరు తెచ్చుకున్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. ఈ క్రమంలో వంటేరుపై 40కి పైగా కేసులు నమోదయ్యాయి. పైగా వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్ట పోయారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వంటేరు టీఆర్‌ఎస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలాగే ప్రతాప్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు పై కేసీఆర్ బలమైన హమీ ఇవ్వడం కూడా పార్టీ మారడానికి కారణమని ప్రచారం జరుగుతోంది.వంటేరు ప్రతాప్ రెడ్డికి వెంటనే ఎమ్మెల్సీ పదవితో పాటు ఆయన కుమారుడికి కూడా రాజకీయ భవిష్యత్తును కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories