వెల్థుర్తి ప్రమాద మృతులకు ముగిసిన సామూహిక అంత్యక్రియలు

వెల్థుర్తి ప్రమాద మృతులకు ముగిసిన సామూహిక అంత్యక్రియలు
x
Highlights

కర్నూలు జిల్లా వెల్థుర్తి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుల స్వగ్రామం రామాపురంలో...

కర్నూలు జిల్లా వెల్థుర్తి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుల స్వగ్రామం రామాపురంలో తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. భారీగా తరలివచ్చిన బంధువులు, చుట్టుపక్కల గ్రామస్తులు, దళిత సంఘాల కన్నీటి నడుమ అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఒకరు, కుటుంబాన్నే కోల్పోయి మరోకరు, నిండు చూలాలిగా ఉండి కట్టుకున్న భర్తను కోల్పోయిన భార్య ఓ వైపు , పెళ్లయిన ఏడాదికి నూరేళ్లు పూర్తి చేసుకున్న మరో భార్య ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథను తలుచుకుంటూ కన్నీరనుమున్నీరుగా విలపించారు.

సామూహిక అంత్యక్రియల సందర్భంగా గ్రామంలో తీవ్ర స్ధాయిలో విషాద వాతావరణంలో నెలకొంది. జరిగిన ఘటనను తలుచుంటూ గ్రామంలోని ఒక్క ఇంట్లో కూడా పొయ్యి వెలగలేదు. గ్రామస్తులంతా మరణించిన వారి ఇళ్ల దగ్గరే ఉంటూ భరోసా కలిగించారు. నిన్నటి వరకు తమతో ఆడుతూ .. పాడుతూ .. సమస్యల సమయంలో అండగా ఉంటూ .. ఆనందాల్లో పాలుపంచుకున్న .. తోటి వారు తమతో లేరనే వాస్తవాన్ని స్ధానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. పగబట్టిన పకృతి యావత్ కుటుంబాన్ని బలి తీసుకుందంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్‌‌తో పాటు స్థానిక అధికారులు, పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. జరిగిన ఘోరాన్ని తలుచుకుంటూ రోదిస్తున్న బాధిత కుటుంబాలకు ధైర్యం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి తగిన పరిహారం ఇప్పించి అండగా నిలుస్తామంటూ భరోసా కల్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories