నాలుగో దఫా పోలింగ్‌ : పశ్చిమ్‌ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు

నాలుగో దఫా పోలింగ్‌ : పశ్చిమ్‌ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు
x
Highlights

ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగో విడతలోనూ పోలింగ్ తీరు మారలేదు. కేంద్రమంత్రి బాబుల్ సుప్రీయోపై టీఎంసీ...

ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగో విడతలోనూ పోలింగ్ తీరు మారలేదు. కేంద్రమంత్రి బాబుల్ సుప్రీయోపై టీఎంసీ కార్యకర్తల దాడికి దిగారు. పోలింగ్‌ బూత్‌లోకి వస్తుండగా తృణముల్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంత్రి బాబుల్ సుప్రియో కారు ధ్వంసమైంది.

నాలుగో విడత పోలింగ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. 8 రాష్ట్రాల పరిధిలోని 71 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు , జమ్ముకశ్మీర్‌లోని అనంత్ నాగ్ నియోజకవర్గంలో రెండో విడత పోలింగ్‌‌ జరుగుతోంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, రాజస్ధాన్‌‌లలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌ల దగ్గరకు చేరుకున్నారు. పలు చోట్ల వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories