Top
logo

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం
X
Highlights

ఉగ్రవాదులు మరోసారి సారి రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజామూన జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లా లాసీపొర...

ఉగ్రవాదులు మరోసారి సారి రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజామూన జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జగిగాయి. ఈ భీకర కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే ప‌క్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ సాయుధ పోలీసులు విస్రృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే జవాన్లపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ముష్కరుల దాడిని తిప్పికొట్టిన భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను హతమర్చారు. అయితే ఈ కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది కూడా గాయపడ్డారు. సంఘటనా స్థలిలో రెండు ఏకే రైఫిల్స్‌, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, ఒక తుపాకీని భద్రతా బలగాలు జప్తు చేసుకున్నాయి.

Next Story