ఉసురు తీస్తున్న ఈత సరదా

ఈత సరదా చిన్నారుల ఉసురు తీస్తోంది. తెలంగాణలో బుధవారం జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత...
ఈత సరదా చిన్నారుల ఉసురు తీస్తోంది. తెలంగాణలో బుధవారం జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మృతులు చిన్నారులు కావడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం రుద్రారంలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా నలుగురు పిల్లల ప్రాణం తీసింది. రుద్రారం గ్రామంలో గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న నీటి కుంటలో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు అందులో మునిగి మృతి చెందారు. మృతి చెందిన చిన్నారులు గోవర్ధన్, విష్ణు వర్ధన్, ఆనంద్, నందినిగా గుర్తించారు. సాయంత్రం ఐదున్నర సమయంలో ఈత కొట్టేందుకు వీళ్లంతా నీటి కుంట వద్దకు వెళ్లారు. అయితే అందులో లోతు ఎక్కువగా ఉండటంతో నీళ్లలో మునిగి వాళ్లు చనిపోయారు. చనిపోయిన పిల్లలంతా హైదరాబాద్‌లోని అల్వాల్ సమీపంలోని బాలాజీనగర్‌కు చెందిన వారుగా గుర్తించారు.
నాగర్‌కర్నూల్‌లో కూడా ఈత సరదా ముగ్గురు ప్రాణాలను తీసింది. బిజినాపల్లి మండలం నందివడ్డెమాన్ గ్రామానికి చెందిన అనిల్, స్వాతి, శైలజ, గణేష్ అనే చిన్నారులు గ్రామ శివారులో ఉన్న సూరయ్య కుంటలో ఈతకు వెళ్లి ప్రమాద వసాత్తూ మునిగిపోయారు. వీరిలో గణేష్ అనే చిన్నారి స్థానికులు కాపాడగా మిగతా ముగ్గరు మృతి చెందారు. ఈ రెండు ఘటనల్లోనూ మృతులు15 ఏళ్ల లోపువారే ఎక్కువగా ఉన్నారు. మొత్తానికి చిన్నారుల మృతితో వారి కుటుంబాల్లో విషాధ ఛాయలు అలమకున్నాయి.
లైవ్ టీవి
మృతదేహాల కోసం ఎదురు చూపులు..
7 Dec 2019 5:55 AM GMTఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు
7 Dec 2019 5:51 AM GMTఅసెంబ్లీలో నిలదీయడానికి టీడీపీకి 21 అంశాలు
7 Dec 2019 5:51 AM GMTచికిత్స పొందుతూ ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి
7 Dec 2019 5:31 AM GMTదేశంలోని టాప్ 10 పోలీస్ స్టేషన్లలో తెలంగాణకు స్థానం
7 Dec 2019 5:29 AM GMT