పాసింజర్‌ రైలులో విద్యుదాఘాతం..నలుగురి గాయాలు

పాసింజర్‌ రైలులో విద్యుదాఘాతం..నలుగురి గాయాలు
x
Highlights

రైల్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఒంగోలు నుంచి గుంటూరు వెళ్తున్న పాసింజర్ రైలు వేజెండ్ల స్టేషన్లో ఆగిన సమయంలో ప్రయాణికులు...

రైల్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఒంగోలు నుంచి గుంటూరు వెళ్తున్న పాసింజర్ రైలు వేజెండ్ల స్టేషన్లో ఆగిన సమయంలో ప్రయాణికులు దిగుతుండగా ఫుట్‌బోర్డుకు విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో నలుగురు గాయపడ్డారు. రైల్వే గార్డు అలెర్ట్ అయి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఒంగోలు నుంచి గుంటూరు వెళుతున్న పాసింజర్‌ రైలులో షార్ట్‌ సర్య్కూట్‌ కావడంతో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా వేజెండ్ల రైల్వే స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. వేజెండ్ల రైల్వేస్టేషన్‌కు చేరుకొన్న పాసింజర్‌ రైలు నుంచి ప్రయాణికులు దిగుతుండగా పుట్‌బోర్డు వద్ద ఉన్న గ్రిల్స్‌కు విద్యుత్‌ సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పాసింజర్‌ రైల్వే గార్డు అప్రమత్తమై రైలులోని విద్యుత్‌ సరఫరాను నిలిపేయడంతో పెనుప్రమాదం తప్పింది.

గాయపడిన ప్రయాణికులను 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో గుంటూరు రైలుపేటకు చెందిన నేరేళ్ల ఇమ్మానియేల్, వేజండ్లకు చెందిన కర్రి నాగరాజు, మరో మహిళ ఉన్నారు. ఈ పరిణామాలతో పాసింజర్ రైలును 2 గంటలపాటు స్టేషన్‌లోనే నిలిపేశారు. ప్రమాదానికి గల కారణాలను రైల్వేశాఖకు చెందిన సాంకేతిక నిపుణులు, అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, ఆ రైలుకు మరో ఇంజన్ తగిలించి తెనాలి జంక్షన్‌కు తీసుకొచ్చిన రైల్వే అధికారులు ఆ ట్రైన్‌ను రద్దు చేశారు. అందులో ఉన్న ప్రయాణికులందరినీ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో గమ్యస్థానాలకు చేర్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories