Top
logo

రెచ్చిపోయిన ఉగ్రవాదులు ; మేజర్‌ సహా ముగ్గురు జవాన్లు మృతి

రెచ్చిపోయిన ఉగ్రవాదులు ; మేజర్‌ సహా ముగ్గురు జవాన్లు మృతి
Highlights

జమ్ము కశ్మీర్లో నాలుగు రోజుల క్రితం 40 మంది జవాన్లను బలి తీసుకున్న ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు....

జమ్ము కశ్మీర్లో నాలుగు రోజుల క్రితం 40 మంది జవాన్లను బలి తీసుకున్న ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. పుల్వామా జిల్లా పింగ్లన్ ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డారు. పింగ్లన్‌ ప్రాంతంలోని ఇంట్లో జైషే ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈలోగా వారు కాల్పులకు తెగబడటంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో మేజర్‌ సహా ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. ఇరు వర్గాల కాల్పుల్లో మరో పౌరుడు కూడా మృతి చెందాడు.

గురువారం జైషే ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ జరిపిన ఆత్మాహుతి దాడి ప్రాంతంలోనే ఇవాళ కాల్పుల ఘటన జరిగింది. పింగ్లాన్ ప్రాంతంలో కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాదులు జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారిగా భావిస్తున్నారు. వీరిద్దరు ఆత్మాహుతి దళ సభ్యుడు ఆదిల్ దార్ అనుచరులుగా అనుమానిస్తున్నారు. ఇవాల్టి ఎన్‌ కౌంటర్ ఘటనలో మరో ఏడుగురు గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

Next Story