కాంగ్రెస్‌కు కేంద్ర మాజీ మంత్రి రాజీనామా

కాంగ్రెస్‌కు కేంద్ర మాజీ మంత్రి రాజీనామా
x
Highlights

విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్ పార్టీకి రాజీనామా చేశారు. కురుపాం ప్యాలెస్‌లో...

విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్ పార్టీకి రాజీనామా చేశారు. కురుపాం ప్యాలెస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన 45 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో రాజీనామా బాధాకరంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని, అందుకే తాను బయటకు వస్తున్నానని స్పష్టం చేశారు. తాను నైతిక విలువలతో ఉన్నందునే ఇంతవరకూ ఏ పార్టీలోకి వెళ్లలేదన్నారు. నాలుగు నెలలుగా పార్టీలో జరుగుతున్న పార్టీ వ్యతిరేక చర్యలను ఎత్తిచూపుతూ పార్టీ అధిష్టానానికి తెలియజేసిన ఎలాంటి స్పందన లేదని, మనస్థాపంతో తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు చెప్పారు. ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ వ్యతిరేక పార్టీలతో సమావేశం అయిన తర్వాత మాత్రమే ఏ పార్టీలో చేరేది స్పష్టం చేస్తానని చెప్పారు కిశోర్ చంద్రదేవ్.

Show Full Article
Print Article
Next Story
More Stories