బీజేపీకి షాక్..కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్రమంత్రి

బీజేపీకి షాక్..కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్రమంత్రి
x
Highlights

తొలి విడత ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 91 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా ఇక రెండో విడత ఎన్నికలు జరిగే లోక్‌సభ స్థానాల్లో...

తొలి విడత ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 91 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా ఇక రెండో విడత ఎన్నికలు జరిగే లోక్‌సభ స్థానాల్లో ఇప్పటికే బీజీపీ, కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నంతగా హోరాహోరీగా ప్రచారంలో దూసుకపోతున్న నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ భారీ షాక్ తగిలింది. మాజీ కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్ శుక్రవారంనాడు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో గూటికి చేరారు. కాగా నాలుగేండ్ల విరామం తర్వాత ఆమె తిరిగి సొంత పార్టీ గూటికి చేరారు. అయితే అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పని చేసిన తీరథ్ 2015లో బీజేపీలో చేరారు. అదే ఏడాది బీజేపీ టిక్కెట్‌పై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీలో దిగారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఆమె చిత్తుగా ఓడిపోయారు. కాగా గతంలో ఢిల్లీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గానూ సేవలందించారు. లోక్‌‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి ఆమె స్వస్తిచెప్పి సొంతగూటికి చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories