విజయవాడ పశ్చిమలో ఫత్వా రాజకీయం

విజయవాడ పశ్చిమలో ఫత్వా రాజకీయం
x
Highlights

బెజవాడ రాజకీయం రంజుగా మారింది. బీకామ్‌ ఫిజిక్స్‌ ఫేమ్‌ జలీల్‌ ఖాన్‌‌కు మాజీ మేయర్‌ మల్లికా బేగం ఊహించని షాకిచ్చారు. ఒకప్పటి జలీల్‌ ఖాన్‌ ప్లాన్‌కు...

బెజవాడ రాజకీయం రంజుగా మారింది. బీకామ్‌ ఫిజిక్స్‌ ఫేమ్‌ జలీల్‌ ఖాన్‌‌కు మాజీ మేయర్‌ మల్లికా బేగం ఊహించని షాకిచ్చారు. ఒకప్పటి జలీల్‌ ఖాన్‌ ప్లాన్‌కు ఇప్పుడు ప్రతీకరాం తీర్చుకున్నారు. ఇంతకీ ఖాన్‌‌కు ఎదురైన ఆ షాక్‌ ఏంటీ మీరే చూడండి. బెజవాడ పశ్చిమ టీడీపీలో వార్ నడుస్తోంది. అధికార పార్టీ నేతల మధ్య ఫత్వా అగ్గి రాజేస్తోంది. తనను ఫత్వా పేరుతో అడ్డుకున్నప్పుడు జలీల్ ఖాన్ కూతురును అడ్డుకోవాల్సిందేనంటూ మల్లికా బేగం అంటుండగా ఇవన్నీ రాజకీయాల్లో భాగమేనని జలీల్ ఖాన్ కొట్టి పారేస్తున్నారు. నేతలను రోడ్డుపైకి తీసుకొచ్చిన ఫత్వా ఏంటి...?

బెజవాడలో ఫత్వా రాజకీయం దుమారం రేపుతోంది. ముస్లిం మహిళలు ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఎవరైనా పోటీ చేస్తే ముస్లిం ప్రజలు ఆమెను ఓడించాలని 2009లో ముస్లిం మత గురువు మౌలానా ఖధీర్ రజ్వీ ఫత్వా జారీచేశారు. నాడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లికా బేగంని ఉద్దేశించి ఫత్వా జారీ అయింది.

అయితే 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె పోటీ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. మల్లికా బేగంకు జారీచేసిన ఫత్వా జలీల్ ఖాన్ కూతురుకు కూడా వర్తిస్తుందని ముస్లిం మత గురువు మౌలానా ఖధీర్ రజ్వీ స్పష్టం చేశారు. ఫత్వాపై జలీల్ ఖాన్ లైట్ తీసుకుంటున్నాడు. నాడు ఫత్వా జారీ చేసిన మాట వాస్తవమే అయినా మల్లికా బేగం ఫత్వాలకు కట్టుబడి లేనందున నేడు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.

మరోవైపు జలీల్ ఖాన్ అవసరాలకు అనుగుణంగా మతాన్ని వాడుకోవడంపై మల్లికాబేగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇస్లాం మతాన్ని వాడుకుంటున్న జలీల్ ఖాన్ పై ముస్లిం సమాజం చర్యలు తీసుకోవాలని మల్లికాబేగం డిమాండ్ చేస్తున్నారు.జలీల్ ఖాన్ నియోజకవర్గంలో ఉన్న నేతలను తనవైపు మరల్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె విజయం ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories