జగన్ ఓటుకే ఎసరు..?

జగన్ ఓటుకే ఎసరు..?
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఫామ్ -7 రేపుతున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఓట్ల తొలగింపు కోసం వాడుతున్న ఈ ఆన్‌లైన్ అప్లికేషన్లు ఏపీలో దాదాపు 9 లక్షలు నమోదు కాగా వీటిలో...

ఆంధ్రప్రదేశ్‌లో ఫామ్ -7 రేపుతున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఓట్ల తొలగింపు కోసం వాడుతున్న ఈ ఆన్‌లైన్ అప్లికేషన్లు ఏపీలో దాదాపు 9 లక్షలు నమోదు కాగా వీటిలో అత్యధికం బోగస్‌వేనని తేల్చారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ పేరుతో ఫామ్ -7 దాఖలవ్వడం కలకలం సృష్టిస్తోంది.

ఏకంగా జగన్ పేరుతో ఫామ్ 7 దరఖాస్తు రావడం సంచలనంగా మారింది. ఓటు తొలగించాలంటూ జగన్ పేరుతో దరఖాస్తు రావడంతో అవాక్కవ్వడం అందరి వంతైంది. జగన్ పేరుతో ఫామ్ 7 రావడంతో అప్రమత్తమైన పులివెందుల రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. జగన్ పేరుతో దాఖలైన ఫామ్ 7 గురించి ఆయన బంధువులను విచారించారు. జగన్ ఫామ్ 7 దాఖలు చేయలేదని ఆయన పేరుతో మరెవరో అప్లై చేశారని తహసీల్దార్‌ గుర్తించారు.

అంతేకాదు..జగన్ పేరుతో దాఖలైన ఫామ్ 7 గురించి పులివెందుల అధికారులు స్వయంగా ఆయన్ని కూడా సంప్రదించారు. వైఎస్‌ జగన్‌కు తెలియకుండానే దరఖాస్తు వచ్చినట్లు నిర్థారించకున్నారు. ఈ ఘటనపై స్థానిక తహసీల్దార్‌ పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పులివెందులలో తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఓటు తొలగించడానికి టీడీపీ నేతలు ఫామ్ 7 దరఖాస్తు చేశారని ఇటీవల జగన్ ఆరోపించారు. ఇప్పడు ఏకంగా ఆయన ఓటు తొలగించాలంటూ ఫామ్ 7 దాఖలయ్యిందన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories