logo

ముగిసిన తొలివిడుత పంచాయతీ నామినేషన్ల పర్వం

ముగిసిన తొలివిడుత పంచాయతీ నామినేషన్ల పర్వం
Highlights

మొదటి విడుత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టం పూర్తయ్యింది. నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. 4 వేలకు పైగా పంచాయతీల్లో జరగనున్న ఎన్నికల కోసం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

మొదటి విడుత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టం పూర్తయ్యింది. నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. 4 వేలకు పైగా పంచాయతీల్లో జరగనున్న ఎన్నికల కోసం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం ఉదయం బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. ఇటు ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 21 న జరగనున్న పంచాయతీ మొదటి విడుత ఎన్నికల కోసం తొలిఘట్టం అయిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 4 వేల 479 పంచాయతీల కోసం రేపటి నుంచి స్కౄట్నీ నిర్వహిస్తారు.

భారీగా వచ్చిన నామినేషన్లను గురువారం ఉదయం పరిశీలించి, బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఆ తర్వాతే ఉప సంహరణలు చెప‌డుతారు. తర్వాత ఈ నెల 13 న తుది జాబితాను విడుదల చేస్తారు. అదేరోజు అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయిస్తారు. నామినేషన్లు దాఖలుచేసిన అభ్యర్థులు ఇప్పటికే ఆయా గ్రామాలు, వార్డుల్లో ప్రచారం చేసుకుంటున్నారు. గుర్తులు కేటాయించిన తర్వాత ప్రచారం మరింత వేడెక్కనుంది. ఈ నెల 21 న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఈ మధ్యలోనే జనవరి 11 నుంచి రెండో విడుత నామినేషన్ల స్వీకరణ, 16 నుంచి మూడో విడుత నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. అయితే ఈ ఎన్నిక‌ల్లో ఏక గ్రీవాల పేరుతో కొంత మంది బ‌ల‌వంత‌పు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఎన్నిక‌ల సంఘం గుర్తిచింది. దీనిపై విచారాణ‌కు అదేశించింది. విచార‌ణ‌లో తేలిన అంశాల‌ను బ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు హెచ్చ‌రించింది.


లైవ్ టీవి


Share it
Top