Top
logo

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌ల మూసివేత.. నేటి రాత్రి రాకపోకలు బంద్‌

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌ల మూసివేత.. నేటి రాత్రి రాకపోకలు బంద్‌
X
Highlights

'జగ్‌నే కి రాత్' సందర్భంగా బుధవారం రాత్రి నగరంలోని ఫ్లైఓవ‌ర్ల‌ను మూసివేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్...

'జగ్‌నే కి రాత్' సందర్భంగా బుధవారం రాత్రి నగరంలోని ఫ్లైఓవ‌ర్ల‌ను మూసివేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. జగ్‌నే కి రాత్ నేపథ్యంలో ముస్లింలు ఈరోజు రాత్రి ప్రార్థనలు చేయనున్నారు. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా నగరంలోని ఫ్లైఓవర్‌లను మూసివేయాలని సీపీ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారుజాము వరకు గ్రీన్ ల్యాండ్స్ ఫ్లైఓవ‌ర్‌, పీవీఎన్‌ఆర్, లంగర్‌హౌస్ ఫ్లైఓవ‌ర్లు మినహా నెక్లెస్‌రోడ్డుతో సహా అన్ని ఫ్లైఓవ‌ర్లు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story