అప్పట్లో సబిత.. ఇప్పుడు సుచరిత..

అప్పట్లో సబిత.. ఇప్పుడు సుచరిత..
x
Highlights

నాడు సబిత. నేడు సుచరిత. అప్పుడు వై.ఎస్. ఇప్పుడు జగన్. అదే హోంశాఖ. కేబినెట్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. చెల్లెమ్మలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సబితా...

నాడు సబిత. నేడు సుచరిత. అప్పుడు వై.ఎస్. ఇప్పుడు జగన్. అదే హోంశాఖ. కేబినెట్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు. చెల్లెమ్మలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తింపు పొందిన సబితను వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తన తొబుట్టువులా ఆదరించారు. ప్రతి రాఖీ పండుగకు సబిత వై.ఎస్.కు రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచారు. రాజకీయంగా వై.ఎస్. సబితకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. తన కేబినెట్‌లో కీలక శాఖ అప్పగించారు. 2009 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి విజయం సాధించిన సబితకు హోంశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు వై.ఎస్. హోంశాఖ మంత్రిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి సబిత అందరి మన్ననలు పొందారు.

ఇప్పుడు ఆ విషయంలో తండ్రి వై.ఎస్‌ను ఫాలో అయ్యారు జగన్. తన మంత్రి వర్గంలో సామాజికంగా సమతూకం పాటించిన జగన్ కీలకమైన హోంశాఖను సుచరితకు అప్పగించారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుచరితకు హ‌ోంశాఖను కేటాయించారు. వై.ఎస్. వలే జగన్ కూడా సుచరితకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కీలకమైన శాఖ ను అప్పగించారు. మొదటి నుండి జగన్ వెన్నంటి ఉండి అండగా నిలిచారు సుచరిత. పార్టీ కార్యక్రమాలతో పాటు పాదయాత్ర, ఏపీకీ ప్రత్యేక హోదా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న సుచరితకు తగిన ప్రాధాన్యత లభించడంపై పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories