సూరత్‌లో అగ్నిప్రమాదం: 21కి చేరిన మృతుల సంఖ్య

సూరత్‌లో అగ్నిప్రమాదం: 21కి చేరిన మృతుల సంఖ్య
x
Highlights

గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో అసలు వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. యజమాని కాసుల కక్కుర్తి అధికారుల తప్పిదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు...

గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో అసలు వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. యజమాని కాసుల కక్కుర్తి అధికారుల తప్పిదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు గుర్తించారు. అధికారుల తీరు కారణంగానే ఇరవై ఒక్క మంది మంది విద్యార్ధుల ప్రాణాలు కోల్పోయారు. ముంచుకొస్తున్న మృత్యువును తప్పించుకునేందుకు ఏ ప్రయత్నం కానరాక భవనం పై నుంచి దూకి తమకు తెలియకుండానే మృత్యువాత పడ్డారు.

ప్రమాదం జరిగిన కోచింగ్‌ సెంటర్ నాలుగో అంతస్తులో నడుస్తోంది. మొదట కింది అంతస్తులో చెలరేగిన మంటలు పై అంతస్తుకు వ్యాపించడంతో బయటకు వెళ‌్లే మార్గం కానరాలేదు. ప్రాణాలు కాపాడుకునే లక్ష్యంతో కిందకు దిగే ప్రయత్నం చేసినా పై నుంచి పలువురు విద్యార్ధులు దూకే ప్రయత్నాలు చేయడంతో మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగింది. మూడో, నాల్గో అంతస్తుల నుంచి కిందకు దూకడం వల్లే ఎక్కువ మంది విద్యార్థులు చనిపోగా, పొగకు ఊపిరాడకపోవడం వల్ల మరికొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు గుర్తించారు.

ఈ ఘటనలో గాయపడిన వారికి సూరత్ లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకున్న ముఖ్యమంత్రి విజయ్ రూపాని పరిస్ధితిని స్వయంగా సమీక్షించారు. అత్యవసర మార్గాలు లేకపోవడం వల్లే మృతుల సంఖ్య పెరిగినట్టు తెలియగానే విచారణకు ఆదేశించారు. చనిపోయిన విద్యార్థుల బంధువులకు 4 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. సూరత్‌లో అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సూరత్‌ అగ్నిప్రమాదం తన తీవ్ర వేదనకు గురి చేసినట్టు ట్వీట్ చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories