ఘోర అగ్నిప్రమాదం: 17 మంది విద్యార్థులు మృతి

ఘోర అగ్నిప్రమాదం: 17 మంది విద్యార్థులు మృతి
x
Highlights

గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సర్తానా ప్రాంతంలోని తక్షశిల కాంప్లెక్స్ రెండో అంతస్థులో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం జరిగిన రెండో...

గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సర్తానా ప్రాంతంలోని తక్షశిల కాంప్లెక్స్ రెండో అంతస్థులో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం జరిగిన రెండో అంతస్థులో ఓ కోచింగ్ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. మంటలు చెలరేగిన సమయంలో విద్యార్థులంతా కోచింగ్ సెంటర్‌లో ఉన్నారు. మంటలను గమనించి ప్రాణాలు కాపాడుకునేందకు కొందరు విద్యార్థులు రెండో అంతస్థుపై నుంచి కిందకు దూసేశారు. మరికొందరు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. కిందికి దూకేసిన వారిలో చాలా మంది తీవ్ర గాయాలతో చనిపోయారు. మరికొంత మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు.

ఈ దుర్ఘటనలో 17 మంది మృతిచెందినట్టు సూరత్‌ పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. ప్రాణాల్ని కాపాడుకొనే క్రమంలో పలువురు విద్యార్థులు భవనంపైనుంచికిందకు దూకేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సీపీ తెలిపారు. ఘటనా స్థలంలో 18 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ ఘటనపై సీఎం విజయ్‌రూపానీ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.ఘోర అగ్నిప్రమాదం; 15 మంది విద్యార్థులు మృతి!

Show Full Article
Print Article
Next Story
More Stories