Top
logo

సిద్దిపేటలో భారీ అగ్ని ప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్ని ప్రమాదం
X
Highlights

సిద్ధిపేట జిల్లా మెదక్ రోడ్డులో రైతు బజార్ ఎదురుగా ఉన్న వెదురు బొంగు దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది....

సిద్ధిపేట జిల్లా మెదక్ రోడ్డులో రైతు బజార్ ఎదురుగా ఉన్న వెదురు బొంగు దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పై పైకి ఎగసి పడుతున్నాయి. రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గాలి విపరీతంగా ఉండటంతో మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉందని చుట్టుపక్కల ఇళ్లల్లోని ప్రజలను ముందస్తు జాగ్రత్తగా ఖాళీ చేపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ నర్సింహారెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఫైర్‌ ఇంజన్లను అధికారులు తెప్పిస్తున్నారు. ఇప్పటివరకు 8 షాపులు పూర్తిగా దగ్దమయ్యాయని, భారీ ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story