ఘోర అగ్ని ప్రమాదం.. 70 మంది మృతి

ఘోర అగ్ని ప్రమాదం.. 70 మంది మృతి
x
Highlights

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని నగరం ఢాకాలోని చౌక్‌బజార్‌ అపార్ట్‌మెంట్‌లోని ఓ రసాయనాల గోదాములో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. ఈ...

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని నగరం ఢాకాలోని చౌక్‌బజార్‌ అపార్ట్‌మెంట్‌లోని ఓ రసాయనాల గోదాములో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 70 మంది సజీవదహనమయ్యారు. వందలాదిమందికి గాయాలయ్యాయి. అపార్ట్‌మెంట్ అంతటా మంటలు వ్యాపించాయి. ప్రక్కనే ఉన్న మరో నాలుగు భవనాలకు మంటలు అంటుకున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అత్యంత రద్దీగా ఉండే చౌక్ బజార్ లో ప్రమాదం జరగటంతో ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. చిన్న చిన్న రోడ్లు, ట్రాఫిక్ అధికంగా ఉండటంతో అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే అక్కడి ప్రజలు ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. నివాస ప్రాంతాల మధ్య గోడౌన్ లో రసాయనాలను ఉంచడం వల్ల అగ్నికిలల ప్రభావం అధికమైంది. మంటలు ఇతర బిల్డింగ్స్ కు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంలో జాప్యం జరిగింది. దీంతో సహయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories