రైతుల కళ్లల్లో పసుపు... రోడ్డెక్కిన అన్నదాతలు

రైతుల కళ్లల్లో పసుపు... రోడ్డెక్కిన అన్నదాతలు
x
Highlights

నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు రోడ్డెక్కారు. జై కిసాన్ నినాదంతో ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ రోడ్లు దద్దరిల్లే విధంగా నినదించారు. చలో ఆర్మూర్ కు...

నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు రోడ్డెక్కారు. జై కిసాన్ నినాదంతో ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ రోడ్లు దద్దరిల్లే విధంగా నినదించారు. చలో ఆర్మూర్ కు పిలుపునిచ్చిన రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. మామిడిపల్లిచౌరస్తాకు చేరుకున్న రైతులు అక్కడే బైఠాయించారు. పసుపుకు మద్దుతు ధర ప్రకటించాలని ఎర్రగజొన్నలను ప్రభుత్వమే కొనుగోలుచేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో ప్రస్తుతం పసుపు ధర క్వింటాకు 4 నుంచి 5 వేలు మాత్రమే ఉందని కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

ఇప్పటికే మద్దతు ధర కల్పించాలంటూ పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లామని అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టామంటున్నారు రైతులు. పెట్టుబడి ఖర్చులు ఏటా పెరుగుతుంటే మార్కెట్లో మాత్రం ధర తగ్గుతూ వస్తుందంటున్నారు అన్నదాతలు. పదేళ్ల క్రితం క్వింటా పసుపు 16 వేలు ఉంటే ప్రస్తుతం ఐదు వేల లేపే ఉందంటున్నారు. కష్టపడి సాగు చేస్తే కనీస పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోయారు.

ఎర్రజొన్నలను కొనుగోలు చేసేందుకు సర్కార్ ముందుకు రావాలని రైతులు డిమాండ్ చేశారు. పసుపు క్విటాలుకు 15వేలు, ఎర్ర జొన్నలకు 3500 ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఎర్రజొన్న వ్యాపారులు బై బ్యాక్ ఒప్పందం నిబంధనను పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. వ్యాపారులు కూటమిగా ఏర్పడి తమను మోసం చేయాలని చూస్తున్నారన్నారని రైతులు ఆరోపించారు. సరైన ధర లేకపోవడంతో మహారాష్ర్టంలో పంట అమ్ముకోవాల్సి వస్తుందని అక్కడికి వెళ్తే రవాణా భారం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు తీరని అన్యాయం జరుగుతుందంటున్నారు రైతులు. వరి పంటను తీసేసి పసుపు పంట సాగు చేశామన్నారు.

రైతుల ఆందోళనతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. రైతుల కదలికలపై కన్నేసిన పోలీసులు పరిస్ధితి చేయి దాటకుండా చర్యలు తీసుకున్నారు. భద్రత కట్టుదిట్టం చేశారు. రైతు సమస్యలపై ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పోలీసులను ఎందుకు మొహరింప చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇప్పుడు చేస్తున్న పోరాటం ఆరంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో భార్యా పిల్లలతో సహా రోడ్డెక్కుతామని రైతులు హెచ్చారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories