ఇందూరులో ఎన్నికల సిత్రం...నామినేషన్లు వేస్తున్న రైతులు!!

ఇందూరులో ఎన్నికల సిత్రం...నామినేషన్లు వేస్తున్న రైతులు!!
x
Highlights

నిజామాబాద్ పార్లమెంటరీ స్థానానికి రైతులు భారీగా నామినేషన్లు వేస్తున్న కారణంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం దగ్గర భారీగా భద్రత ఏర్పాటు చేశారు....

నిజామాబాద్ పార్లమెంటరీ స్థానానికి రైతులు భారీగా నామినేషన్లు వేస్తున్న కారణంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం దగ్గర భారీగా భద్రత ఏర్పాటు చేశారు. పసుపు, ఎర్రజొన్న పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడాన్ని నిరశిస్తూ రైతులు భారీగా నామిషన్లు వేస్తున్నారు. కలెక్టరేట్‌లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రైతులు క్యూ కట్టారు. జగిత్యాల , బాల్కొండ, ఆర్మూర్ నుంచి వచ్చిన వంద మందికి పైగా రైతులు నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్లు వేయడానికి వచ్చారు. దీంతో కలెక్టరే్ట్ దగ్గర పోలీసులు 144 సెక్షన్ విధించారు.

నిజామాబాద్ పసుపు, ఎర్రజొన్న రైతులు ఎన్నికల బరిలోకి దిగుతుంటే వారి బాటలోనే చెరుకు రైతులు కూడా నడుస్తున్నారు. మద్దతు ధర కోసం చెరుకు రైతులు నామినేషన్ల వేసేందుకు సిద్ధమయ్యారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నామినేషన్లు వేసేందుకు చెరుకు రైతులు సన్నాహాలు చేసుకొంటున్నారు. బోధన్‌ ప్రాంత చెరుకు రైతులు ఇవాళ నామినేషన్లు పెద్ద సంఖ్యలో వేస్తామని ప్రకటించారు. అలాగే ఖమ్మం ‌లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మిర్చి రైతులు కూడా మద్దతు ధర ప్రకటించని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందకు పైగా నామినేషన్లు వేయలని నిర్ణయించారు. దీంతో నిజామాబాద్‌, ఖమ్మం లోక్‌సభ స్థానాల పరిధిలో ఇవాళ సాయంత్రానికి వందకు పైగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది.




Show Full Article
Print Article
Next Story
More Stories