ఖమ్మం లోక్‌సభ బరిలో 200మంది రైతులు?

ఖమ్మం లోక్‌సభ బరిలో 200మంది రైతులు?
x
Highlights

నిజామాబాద్ పసుపు , ఎర్రజొన్న రైతుల తరహాలోనే ఖమ్మం జిల్లా సుబాబుల్ రైతులు గిట్టుబాటు ధర కోసం పోరుబాట పట్టారు. సుబాబుల్‌కు మద్దతు కోసం ఎన్నికల...

నిజామాబాద్ పసుపు , ఎర్రజొన్న రైతుల తరహాలోనే ఖమ్మం జిల్లా సుబాబుల్ రైతులు గిట్టుబాటు ధర కోసం పోరుబాట పట్టారు. సుబాబుల్‌కు మద్దతు కోసం ఎన్నికల రణక్షేత్రంలోకి దిగుతున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో మొత్తం 64మంది సబాబుల్ రైతులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లా సుబాబుల్ రైతులు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐటీసీ కాగితం పరిశ్రమ సౌజన్యంతో దాదాపు 10వేల హెక్టార్లలో సబాబుల్ పంట పండిస్తున్నారు. కాగా ఐటీసీ కాగితం పరిశ్రమ రైతుల నుండి సుబాబుల్ కర్ర కొనుగోలు చేయడంలో చాలా ఇబ్బందులకు గురిచేస్తూ ధర కూడా తగ్గించి తమ పండించిన దానికి కూడా సరైన ధర ఇవ్వకపోవడంతో వాపోతున్నారు రైతులు. సుబాబుల్‌ ధర రూ.6,100గా గతంలో నిర్ణయించగా ఇప్పుడు మాత్రం కాగితం పరిశ్రమ మెట్రిక్‌ టన్ను ధర రూ.3 వేల నుంచి 4 వేల మధ్యనే కొనుగోలు చేస్తోంది. సుబాబుల్ రైతులు 200 మంది సుబాబుల్‌ రైతులు తమ నిరసనను కేంద్రసర్కార్‌కి తెలిసే విధంగా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి మూకుమ్మడిగా నామినేషన్ల వేయాలని నిర్ణయించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories