Top
logo

సప్నా చౌదరి డ్యాన్స్ షోలో తొక్కిసలాట.. అభిమానులపై లాఠీ చార్జ్

సప్నా చౌదరి డ్యాన్స్ షోలో తొక్కిసలాట.. అభిమానులపై లాఠీ చార్జ్
X
Highlights

హీరోయిన్లను తలదన్నే అందం ఆమె సొంతం. ఆమె షో ఉందంటే చాలు జనం ఎగబడతారు. ఇక కుర్రకారైతే ఆమె డ్యాన్స్ చూసేందుకు...

హీరోయిన్లను తలదన్నే అందం ఆమె సొంతం. ఆమె షో ఉందంటే చాలు జనం ఎగబడతారు. ఇక కుర్రకారైతే ఆమె డ్యాన్స్ చూసేందుకు పోటీ పడతారు. ప్రముఖ సింగర్ కమ్ డ్యాన్సర్ సప్నా చౌదరిని జనాల్లో ఉన్న క్రేజ్ ఇది. తాజాగా ఈ సింగర్ షోలో తొక్కిసలాట జరిగింది దీంతో పలువురు గాయపడ్డారు.

హరియాణాకు చెందిన సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరికి ఉత్తర భారతదేశంలో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె షో ఉందంటే చాలు. చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఇక కుర్రకారు తమనితామే మైమరిచిపోతారు ఈ బామను చూసి ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

తాజాగా రాజ్‌గఢ్‌లో స్వప్న చౌదిరి డ్యాన్స్ షో నిర్వహించారు. దీంతో ఆమె డ్యాన్స్ చూసేందుకు అభిమానులు విపరీతంగా వచ్చారు. స్వప్న డ్యాన్స్ మొదలుపెట్టగానే కుర్చీలో కూర్చున్న జనమంతా లేచి నిలబడ్డారు. ఈలల కేరింతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వెనకాల ఉన్నవారు ముందుకు వచ్చి ఆమె డ్యాన్స్ ని తిలకించాలని భావించారు. ఈ క్రమంలోనే ఒకరొనికరు తోసుకోవడం మొదలుపెట్టారు. దీంతో తొక్కిసలాట జరిగింది. షో నిర్వాహకులు సరిగా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకునట్లు తెలుస్తోంది ఈ తొక్కిసలాటలో ఇద్దరు అభిమానులు గాయపడ్డారు.

దీంతో కల్పించుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించడంతో అభిమానులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అదే సమయంలో సప్నా చౌదరిని వేదికపై నుంచి పోలీసులు క్షేమంగా తరలించారు. ఇక గతేడాది నవంబరులో బెగూసరాయ్‌లో నిర్వహించిన సప్న షోలోనూ గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మొత్తానికి ఈ సారి ఇలాంటి షోలు నిర్వహించేటప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story