ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ కి ఫాన్స్ ప్రత్యేక పూజలు ..

ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ కి ఫాన్స్ ప్రత్యేక పూజలు ..
x
Highlights

ప్రపంచ కప్‌ క్రికెట్‌ టోర్నిలో భాగంగా ఇవాళ పాకిస్థాన్‌తో జరిగే పోటీలో భారత జట్టు గెలవాలని దేశ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ప్రత్యేక పూజలు...

ప్రపంచ కప్‌ క్రికెట్‌ టోర్నిలో భాగంగా ఇవాళ పాకిస్థాన్‌తో జరిగే పోటీలో భారత జట్టు గెలవాలని దేశ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తమకు తోచిన రీతిలో అభిమానం చాటుకుంటున్నారు. కేరింతలు కొడుతూ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత జట్టు విజయంలో ధోనీ, కోహ్లీ కీలక పాత్ర పోషించాలని వారు కోరుతున్నారు.

కాకినాడ:-

కాకినాడలో క్రికెట్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేసారు. రెవెన్యూ కాలనీలోని ధర్మసాయిబాబా ఆలయంలో వరుణదేవుడు కరుణించాలని పూజలు నిర్వహించారు.

ఖమ్మం:-

ఖమ్మం లోని చారిత్రిక గుంటు మల్లన్న దేవాలయంలో క్రికెట్ అభిమానులు యాగం నిర్వహిస్తున్నారు. భారత్ విజయకేతనం ఎగురవేయాలని కోరుకున్నారు ..

రాజమండ్రి :-

టీమిండియా విజయం ఖాయమన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. భారత్ - పాక్ మధ్య క్రికెట్ పోరులో ఒక్కోసారి బాల్స్ సరిగ్గా పడకపోతే గబగజా దేవుడి గదిలోకి వెళ్లి దణ్ణం పెట్టుకునేవాళ్లమని భవానీ చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

తిరుపతి :-

తిరుపతిలోని క్రీడాభిమానులు అలిపిరి వద్ద పూజలు నిర్వహించారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద మోకాళ్ళపై నడిచి ప్రార్థించారు. క్రికెట్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారకుండా ఉండేలా వరుణ దేవుడు కరుణించాలని మొక్కుకున్నారు.

వారణాసి :-

వారణాసిలో క్రికెట్‌ అభిమానులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. భారత్ జట్టు విజయం సాధించాలని నదిలో దిగి హారతులిచ్చారు. కేరింతలతో టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు ఎప్పుడు ఇండియాపై వరల్డ్ కప్ లో పాకిస్థాన్ గెలవలేదు. ధోని, కోహ్లీ సెంచరీ కొట్టాలని వరంగల్ యువతులు కోరుకుంటున్నారు.

అనంతపురం :-

భారత్ - పాకిస్థాన్ మధ్య ఇవాళ జరిగే మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అంటున్నారు అనంతపురంలోని క్రికెట్ కోచ్‌లు, క్యూరేటర్లు. ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్ లైన్‌ అప్ పటిష్టంగా ఉందని చెబుతున్నారు. శిఖర్ ధావన్ లేకపోవడం కొంత లోటు అయినప్పటికీ కె.ఎల్. రాహుల్ ద్వారా ఆ స్థానాన్ని భర్తీ చేయడం మంచిదంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories