నేను నిజంగానే ఎంపీ అయ్యాను.. అనుకున్నది సాధించావ్ పో శివారెడ్డి..

నేను నిజంగానే ఎంపీ అయ్యాను.. అనుకున్నది సాధించావ్ పో శివారెడ్డి..
x
Highlights

సాధారణంగా అయితే వాస్తవ కధల నుండి సినిమా కధలు పుడుతూ ఉంటాయి .. కానీ ఇక్కడ ఓ సినిమా కధలోని ఓ అంశం మాత్రం ఓ వ్యక్తికి వాస్తవానికి దగ్గర చేసింది . అది...

సాధారణంగా అయితే వాస్తవ కధల నుండి సినిమా కధలు పుడుతూ ఉంటాయి .. కానీ ఇక్కడ ఓ సినిమా కధలోని ఓ అంశం మాత్రం ఓ వ్యక్తికి వాస్తవానికి దగ్గర చేసింది . అది ఎలా అంటారా ఐతే ఇది చదవాల్సిందే .. తెలుగులో సరిగ్గా ఐదేళ్ళ క్రితం వచ్చిన అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమా అందరికి గుర్తే ఉంటుంది కదా .. అందులో విలన్ గా చేసిన మద్దాలి శివారెడ్డి అలియాస్‌ (రవికిషన్‌) కి మంచి పేరు వచ్చింది .. అయితే ఆ సినిమాలో అతను ఎమెల్యే అయి.. అ తర్వాత మంత్రి అయిపోవాలని కలలు కంటుంటాడు .. కానీ దానికి హీరో అల్లు అర్జున్ ప్రతిసారి అడ్డం పడుతూ ఉంటాడు .. చివరికి నామినేషన్ వేయలేకపోయినా ఆ తరవాత ఎలాగోలా మంత్రి అయిపోతాడు. అ తర్వాత 'మద్దాలి శివారెడ్డి అనే నేను..' అంటూ పదవీ ప్రమాణ స్వీకారం చేసి పొలిటికల్‌ పవర్‌ను తెగ ఎంజాయ్‌ చేస్తూ ఉంటాడు .. ఇది సినిమా కధ .. జస్ట్ ఒక్కసారి ఇది నిజం అయితే ఎలా ఉంటుంది చెప్పండి ..












అయితే ఇది నిజంగానే జరిగింది.. రేసుగుర్రం సినిమా విలన్ రవికిషన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి మూడు లక్షల మెజారిటితో విజయం సాధించారు ..తాజాగా ప్రమాణస్వీకారం కూడా చేసేసాడు కూడా .. అయితే దీనిపైన నేటిజన్స్ ఫన్నీ కామెంట్స్ తో రవికిషన్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు .. నిజంగానే ఎంపీ అయ్యావ్ శివారెడ్డి అని కొందరు అంటుంటే.. సినిమాలో విలన్ గా మంత్రి అయ్యావ్ .. ఇప్పుడు హీరోగా మంత్రి అయ్యావ్ ప్రజలకు మంచిగా సేవ చేయండి సార్ అని కామెంట్స్ పెడుతున్నారు .. మొత్తానికి అనుకున్నది సాధించావ్ పో శివారెడ్డి అని మరికొందరు అంటున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories