సింధు శర్మకు కూతుర్ని అప్పగించడంలో ఉద్రిక్తత..

సింధు శర్మకు కూతుర్ని అప్పగించడంలో ఉద్రిక్తత..
x
Highlights

మూడున్నరేళ్ల పాపను తల్లి సింధూ శర్మకు అప్పగించేందుకు వశిష్ట కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, బాలల హక్కుల సంఘం సభ్యులు సంయుక్తంగా...

మూడున్నరేళ్ల పాపను తల్లి సింధూ శర్మకు అప్పగించేందుకు వశిష్ట కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, బాలల హక్కుల సంఘం సభ్యులు సంయుక్తంగా రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అంతకుముందు కుమార్తెను అప్పగించే విషయంలో నాంపల్లి భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మకు ఆమె పెద్ద కుమార్తెను అప్పగించే విషయంలో నాంపల్లి భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు కుటుంబాలూ చిన్నారిని తీసుకెళ్లేందుకు యత్నించడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.

అధికారుల తీరును సింధు శర్మతో పాటు మహిళా సంఘాలు తప్పుపట్టాయి. చిన్నారిని తల్లికే అప్పగించాలని డిమాండ్ చేశాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, బాలల హక్కుల సంఘం సభ్యులు రంగంలో దిగారు. రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. దీంతో మూడున్నరేళ్ల పాపను తల్లి సింధూ శర్మకు అప్పగించేందుకు వశిష్ట కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. నాంపల్లి భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడం భరోసా కేంద్రం అధికారులు రంగంలో దిగడంతో సమస్య పరిష్కారం అయినట్లే కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories