ఏపీ పార్లమెంట్‌ ఫైట్‌లోనూ వైసీపీ హవా

ఏపీ పార్లమెంట్‌ ఫైట్‌లోనూ వైసీపీ హవా
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పోరులోనే కాదు, లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌‌దే విజయమని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి. మొత్తం 25 సీట్లలో అత్యధికం...

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పోరులోనే కాదు, లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌‌దే విజయమని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి. మొత్తం 25 సీట్లలో అత్యధికం జగన్‌ పార్టీవేనని పోల్స్‌ తేల్చేశాయి. అయితే, లగడపాటితో పాటు కొన్ని సంస్థలు మాత్రం టీడీపీకే అత్యధిక లోక్‌సభ స్థానాలని అంచనా వేసి, పోరు రసవత్తరమని తెలిపాయి.

యాక్సిస్ మై నేషన్‌‌ సంస్థతో కలిసి సర్వే చేసిన ప్రముఖ ఇంగ్లీష్‌ ఛానెల్ ఇండియా టుడే, ఆంధ్రప్రదేశ‌‌ పార్లమెంట్‌ స్థానాల్లోనూ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. టీడీపీకి 4-6 సీట్లు వస్తాయని అంచనా వేసిన ఇండియా టుడే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఏకంగా 18-20 స్థానాలు ఖాయమని భావించింది. ఇతరులకు మాత్రం ఒకటి రావొచ్చని తెలిపింది.

* ఎన్డీటీవీ కూడా వైసీపీకి ఎక్కువ పార్లమెంట్ స్థానాలొస్తాయని తెలిపింది. అత్యధికంగా 17 సీట్లు వస్తాయంది. టీడీపీకి వచ్చే స్థానాలు ఎనిమిదిగా లెక్కగట్టింది.

* ఇండియా టీవీ కూడా తన ఎగ్జిట్‌పోల్స్‌లో టీడీపీకి ఇచ్చిన సీట్ల సంఖ్య 7. వైసీీపీకి లోక్‌సభ సీట్లు 18.

* మరో ప్రముఖ ఆంగ్ల ఛానెల్‌ రిపబ్లిక్‌ టీవీ, టీడీపీకి 15 సీట్లు వస్తాయని తెలిపింది. వైసీీపీకి 11 స్థానాలని అభిప్రాయపడింది.

* న్యూస్‌ 18 , టీడీపీ, వైసీపీకి పోటాపోటీ స్థానాలిచ్చింది. టీడీపీకి 10-12 స్థానాలొస్తాయని, అలాగే వైసీీపీకి 13-14 రావొచ్చన్నది అంచనా. ఇతరులు ఒకస్థానంలో గెలుస్తారన్నది న్యూస్‌ 18 భావన.

* మరో ప్రముఖ ఆంగ్ల ఛానెల్ టైమ్స్‌ తన అంచనాలు వెల్లడించింది. టీడీపీకి ఏడు స్థానాలు వస్తాయన్న టైమ్స్ నౌ, వైసీపీకి అత్యధికంగా 18 సీట్లు రావొచ్చన్నది తన అంచనాగా వెల్లడించింది.

* ఏబీపీ హిందీ ఛానెల్ సైతం వైసీపీకి ఎక్కువ పార్లమెంట్ స్థానాలని తెలిపింది. దాదాపు 20 లోక్‌సభ సీట్లు వైసీపీవేనని అంచనా కట్టింది ఏబీపీ. టీడీపీకి కేవలం ఐదు స్థానాలే వస్తాయన్నది ఏబీపీ సర్వే సారాంశం.

* ఆరా సంస్థ కూడా వైసీపీకే పట్టంకట్టింది. టీడీపీకి కేవలం 1-5 వస్తాయని అంచనా వేసిన ఆరా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు 20-24 లోక్‌సభ సీట్లు వస్తాయని తెలిపింది.

* మిషన్‌ చాణక్య వైసీపీకి ఇచ్చిన సీట్లు 15-16. టీడీపీకి 8-10. జనసేనకు ఒకే ఒక్కటి.

* ఇక మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం లోక్‌సభ సీట్లలోనూ తెలుగుదేశానిదే ప్రభంజనమని చెప్పారు. మొత్తం 25 సీట్లలో 15-17 స్థానాలు రావొచ్చని తమ బృందం జరిపిన సర్వేలో తేలిందన్నారు లగడపాటి. అలాగే వైసీపీకి 10-12 సీట్లు వస్తాయన్నది ఆయన అంచనా. జనసేనకు సైతం ఒక సీటిచ్చారు లగడపాటి.

* ఐఎన్ఎస్‌ఎస్‌ కూడా టీడీపీకి 17 స్థానాలని తెలిపింది. వైసీపీకి ఏడు సీట్లు వస్తాయని వెల్లడించింది. జనసేనకు ఒకస్థానమిచ్చింది. సీ ఓటర్‌ సైతం టీడీపీకి 14 సీట్లు వస్తాయని అంచనా వేసింది. వైసీపీకి వచ్చే స్థానాలు 11.

Show Full Article
Print Article
Next Story
More Stories