logo

వివేకాపై జగన్ రెండు సార్లు చేయి చేసుకున్నారు: హర్షకుమార్

వివేకాపై జగన్ రెండు సార్లు చేయి చేసుకున్నారు: హర్షకుమార్
Highlights

వివేకానంద హత్యతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. హత్య దగ్గర నుంచి విచారణ వరకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య...

వివేకానంద హత్యతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. హత్య దగ్గర నుంచి విచారణ వరకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మరోవైపు ఎన్నికల సమయం కూడా కావడంతో ఇరు పార్టీల అధినేతల మాటల తూటాలు, పొలిటికల్ హీట్ ను పెంచేస్తున్నాయి. వివేకానంద హత్యను సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ మాత్రం, సిట్‌పై తమకు నమ్మకం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీ అధినేత జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి మరణం హర్షకుమార్ మాట్లాడుతూ ఆయన ఓ విషయాన్ని బయటపెట్టారు. 2006లో వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి తన బాబాయ్ వివేకాపై రెండు సార్లు చేయి చేసుకున్నారని, ఈ విషయం అప్పట్లో ఉన్న ఎంపీలందరికీ తెలుసని మాజీ ఎంపీ హర్షకుమార్ బాంబు పేల్చారు. వివేకానంద మరణం ద్వారా వైసీపీ అధినేత వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.

లైవ్ టీవి

Share it
Top