సిద్ధరామయ్యపై కేసు పెట్టండి : జాతీయ మహిళా కమిషన్

సిద్ధరామయ్యపై కేసు పెట్టండి : జాతీయ మహిళా కమిషన్
x
Highlights

కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య చిక్కుల్లో పడ్డారు. ఓ సభలో సహనం కోల్పోయిన సిద్ధరామయ్య మహిళపై దురుసుగా ప్రవర్తించారు. మహిళ చేతిలో నుంచి మైక్ లాక్కుని...

కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య చిక్కుల్లో పడ్డారు. ఓ సభలో సహనం కోల్పోయిన సిద్ధరామయ్య మహిళపై దురుసుగా ప్రవర్తించారు. మహిళ చేతిలో నుంచి మైక్ లాక్కుని అనుచితంగా ప్రవర్తించారు. సిద్ధరామయ్యకు సంబందించిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కర్ణాటక పోలీసులను కోరింది.

కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. మైసూర్‌లో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో జమీలా అనే మహిళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సమస్యలను సిద్ధరామయ్య దృష్టికి తీసుకువెళుతున్న ఆమెపై సీరియస్ అయ్యారు. ఆమె చేతిలో ఉన్న మైక్‌ను లాక్కొన్నారు. అప్పటికీ ఆమె తన వాదనను వినిపిస్తూనే ఉంది. దీంతో సిద్ధరామయ్య ఆమెపై మరింత గట్టిగా అరిచారు. ఆమె భుజంపై చేయిపెట్టి బలవంతంగా కూర్చోబెట్టారు. మెల్లగా మాట్లాడు అంటూ బెదిరించారు.

సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పై జమీలా పలు ప్రశ్నలు సంధించారు. వరుణా నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా ఉన్న యతీంద్ర అందుబాటులో ఉండడం లేదంటూ సిద్ధరామయ్యకు జమీలా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయడం లేదంటూ సిద్ధరామయ్యకు వివరించారు. ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదంటూ జమీల మండిపడింది. ఈ క్రమంలో సిద్ధరామయ్య బ్యాలెన్స్ తప్పారు. మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిద్ధరామయ్య ఓ మహిళపై సీరియస్‌ అయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సిద్ధరామయ్యపై విమర్శలు వర్షం కురుస్తోంది. కాంగ్రెస్ నాయకులు మహిళల పట్ల ఈ విధంగానే ప్రవర్తిస్తారంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

సిద్ధరామయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాకేశ్ ఓ ప్రమాదంలో మరణించారు. రాకేశ్ మరణంతో సిద్ధరామయ్య చిన్న కుమారుడు యతీంద్ర రాజకీయాల్లోకి వచ్చారు. డాక్టర్ వృత్తిలో ఉన్న యతీంద్ర పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. సిద్ధరామయ్య అప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన వరుణా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు.

మైసూర్‌లో జరిగిన చున్నీ సంఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత దినేశ్ గుండూరావు స్పందించారు. సిద్ధరామయ్యకు ఫిర్యాదు చేస్తున్న మహిళ చాలా సేపటి నుంచి గట్టిగా మాట్లాడడంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయివుండవచ్చని అన్నారు.

మరోవైపు జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. కమిషన్ చైర్‌పర్సన్ రేఖ శర్మ ఓ ట్వీట్‌లో ఈ అంశాన్ని విచారణకు చేపట్టామని పేర్కొన్నారు. ఈ సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక పోలీసులకు లేఖ రాస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories