Top
logo

బీజేపీ ఎదుగుదలకు వ్యూహాలు రూపొందిస్తాం : డీకే. అరుణ

బీజేపీ ఎదుగుదలకు వ్యూహాలు రూపొందిస్తాం : డీకే. అరుణ
Highlights

దేశానికి మోడీ నాయకత్వం అవసరమని మాజీ మంత్రి డీకే. అరుణ అన్నారు. గత అర్థరాత్రి బీజేపీలో చేరిన డీకే. అరుణ...

దేశానికి మోడీ నాయకత్వం అవసరమని మాజీ మంత్రి డీకే. అరుణ అన్నారు. గత అర్థరాత్రి బీజేపీలో చేరిన డీకే. అరుణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ పార్లమెంటు సీట్లు గెలిపించేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యకర్తలందర్నీ కలుపుకుని తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు వ్యూహాలు రూపొందిస్తామని డీకే. అరుణ చెప్పుకొచ్చారు. అటు తెలంగాణలో కేసీఆర్ కుటుంబ ఆధిపత్యం పెరిగిపోయిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. దేశంలో మోడీ రాహుల్ తప్ప మరేవరూ లేరా అని ప్రశ్నిస్తున్న కేసీఆర్ తెలంగాణలో తన కుటుంబానికే ఎందుకు పదవులు కట్టబెడుతున్నారో చెప్పాలని నిలదీశారు.

Next Story


లైవ్ టీవి