కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌ ఇచ్చిన గద్వాల జేజమ్మ

కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌ ఇచ్చిన గద్వాల జేజమ్మ
x
Highlights

కారు షాకులతోనే కకావికలమైన కాంగ్రెస్‌కు కమలం పార్టీ ఖతర్‌నాక్‌ ఝలక్‌ ఇచ్చింది. గద్వాల జేజమ్మ మాజీ మంత్రి డీకే అరుణ కాషాయం కండువా కప్పుకుంది. ఢిల్లీలోని...

కారు షాకులతోనే కకావికలమైన కాంగ్రెస్‌కు కమలం పార్టీ ఖతర్‌నాక్‌ ఝలక్‌ ఇచ్చింది. గద్వాల జేజమ్మ మాజీ మంత్రి డీకే అరుణ కాషాయం కండువా కప్పుకుంది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంది. నిన్న ఉదయం బీజేపీ నాయకుడు రామ్ మాధవ్‌తో చర్చల తర్వాత ఢిల్లీ బయల్దేరిన ఆమె కమలం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో 8 మంది ఎమ్మెల్యేలు కారెక్కగా తాజాగా ఆ పార్టీ సీనియర్‌ లీడర్‌, మాజీ మంత్రి డీకే అరుణ ఊహించని షాక్‌ ఇచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో డీకే అరుణ కాషాయం కండువా మార్చుకుంది. మంగళవారం ఉదయం బీజేపీ జాతీయ నేత రామ్‌ మాధవ్‌ డీకే అరుణ నివాసంలో కలిశారు. సుమారు 45 నిమిషాలు చర్చించారు. బీజేపీలోకి రావాలని ఆమెను ఆహ్వానించారు. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో ఫోన్‌లో మాట్లాడించారు. రాజకీయ భవిష్యత్తుకు అమిత్ షా భరోసా ఇచ్చారు.

అయితే అమిత్ షా హామీతో డీకే అరుణ.. మంగళవారం సాయంత్రమే ఢిల్లీకి బయల్దేరి వెళ్లింది. అర్ధరాత్రి దాటాక ఆమె అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. అమిత్ షా డీకే అరుణకు కాషాయం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అయితే గద్వాల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన డీకే అరుణను మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేయించాలని తొలుత టీ పీసీసీ భావించినా బరిలో నిల్చేందుకు ఆమె ఆసక్తి చూపించలేదు. అంతలోనే అరుణ పార్టీ మారడం టీ పీసీసీ పెద్దలకు ఊహించని పరిణామంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది. ఓ వైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నా బలమైన నేతలను ఎంపీ అభ్యర్థుగా బరిలోకి దించి సత్తాచాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో డీకే అరుణ దూరం కావడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. క్యాంపెయిన్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా ఉన్న అరుణ పార్టీని వీడడం కాంగ్రెస్ పెద్దలను తీవ్ర కలవరానికి గురిచేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories