ఈవీఎంలనే వాడుతాం...తేల్చిచెప్పిన సీఈసీ

ఈవీఎంలనే వాడుతాం...తేల్చిచెప్పిన సీఈసీ
x
Highlights

ఈవీఎం హ్యాకింగ్‌ వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఎట్టి పరిస్దితుల్లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి...

ఈవీఎం హ్యాకింగ్‌ వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఎట్టి పరిస్దితుల్లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ఈవీఎంలను రూపొందిస్తున్నట్టు సీఈసీ తెలియజేశారు. ప్రస్తుత పరిస్ధితుల్లో వెనక్కు వెళ్లి బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించలేమంటూ ఆయన స్పష్టం చేశారు. 2014 తరువాత 15 పైగా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించామన్న ఆయన వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు విజయం సాధించాయన్నారు. రాజకీయ పార్టీలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈవీఎంలపై సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన తీర్పు నిచ్చిందంటూ ఆయన గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories