మందుబాబులు జాగ్రత్త....

మందుబాబులు జాగ్రత్త....
x
Highlights

మందుబాబులు జాగ్రత్త. మద్యం మితంగా తాగినా ముప్పే అంటోంది తాజా అధ్యయనం. కొద్ది మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా అవయవాలు చెడిపోవడం బీపీ పెరిగిపోవడం...

మందుబాబులు జాగ్రత్త. మద్యం మితంగా తాగినా ముప్పే అంటోంది తాజా అధ్యయనం. కొద్ది మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా అవయవాలు చెడిపోవడం బీపీ పెరిగిపోవడం ఖాయమంటోంది. మరణానికి చేరువవుతారని హెచ్చరిస్తోంది.

మద్యం తాగడం ఓ ఫ్యాషన్‌ అయిపోయింది. మద్యానికి బానిసలై చాలామంది చావును కొనితెచ్చుకుంటున్నారు. మితంగా మద్యం తీసుకుంటే ఆరోగ్యానికి ముఖ్యంగా గుండెకు మంచిదన్న ప్రచారంతో దీన్ని సాకుగా తీసుకుని మందు గ్లాసు పట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. అలాంటి వారికి తాజా అధ్యయనం హెచ్చరిక చేసింది. వారానికి 100 ఎ.ఎల్.కు మించి ఆల్కహాల్ తీసుకున్నా అకాల మరణ ముప్పు తప్పదని చెబుతోంది.

అమెరికాకు చెందిన జాతీయ ఆరోగ్య , పౌష్టికాహార కేంద్రానికి చెందిన అధ్యయన కర్తలు 17,059 మంది ఆరోగ్యాన్ని పరిశీలించారు. వారానికి 100ఎం.ఎల్.ల కంటే ఎక్కువ మద్యం తీసుకునే వారి సంఖ్య 50శాతం పైనే ఉంది. 350 ఎం.ఎల్ కంటే ఎక్కువ తాగే వారు 8.4శాతం మంది ఉన్నారు. వయస్సు, మధుమేహ స్థితిగతులు, ధూమపానం, హృద్రోగాలు లాంటి ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ సమాచారాన్ని వారానికి వంద ఎం.ఎల్.ల కంటే తక్కువ తాగి వారితో సరిపోల్చారు.

100 నుంచి 200 ఎం.ఎల్.ల మధ్య తాగే వారికి 40ఏళ్లలో ఆరు నెలల వరకు ఆయష్షు తగ్గునున్నట్లు తేలింది. అదే 200 నుంచి 350 ఎం.ఎల్‌.లు తాగే వారు అయితే రెండేళ్లు, 350 ఎం.ఎల్.లకు మించితే నాలుగు నుంచి ఐదేళ్లు నష్టపోతున్నట్లు బయటపడింది. గుండె వైఫల్యం, పక్షవాతం, రక్తపోటు పెరగడం లాంటి రుగ్మతలు చుట్టుముట్టడమే మరణ ముప్పుకు ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు. మద్యం తాగి వ్యాధులు కొని తెచ్చుకోకుండా సంపూర్ణ ఆరోగ్యానికి దీర్ఘాయుష్సు కోసం మద్యం మానాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories