వెస్టిండిస్ పై ఇంగ్లాండ్ అలోవకంగా విజయం ..

వెస్టిండిస్ పై ఇంగ్లాండ్ అలోవకంగా విజయం ..
x
Highlights

ప్రపంచ కప్ లో నిన్న జరిగిన ఇంగ్లాండ్ వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ అలవోకంగా విజయాన్ని అందుకుంది ..ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ రెండు...

ప్రపంచ కప్ లో నిన్న జరిగిన ఇంగ్లాండ్ వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ అలవోకంగా విజయాన్ని అందుకుంది ..ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ రెండు వికెట్లు నష్టపోయి 33.1 ఓవర్లోనే విజయాన్ని చేరుకుంది .. వెస్టిండిస్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ ఓపెనర్లు బెయిర్ స్టో మరియు జో రూట్ ఇన్నింగ్స్ ని దూకుడుగా ప్రారంభంచారు . ఇద్దరు కలిసి మొదటి వికెట్ కి గాను 95 పరుగులు జోడించారు ..ఈ క్రమంలో బెయిర్ స్టో అవుట్ అయ్యాడు .

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వోక్స్‌తో కలిసి జో రూట్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. విజయానికి మరో 14 పరుగులు అవసరమైన తరుణంలో క్రిస్ వోక్స్(40) అనవసరమైన షాట్ కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు .. మరోవైపు జోరూట్ 93 బంతుల్లో 11 ఫోర్లతో వన్డేల్లో 16 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం బెన్ స్టోక్స్ ఫోర్ కొట్టి ఇంగ్లాండ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

అంతకు ముందు టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన విండిస్ జట్టు మొత్తం 44.4 ఓవర్లకు గాను 212 పరుగులు చేసి ఆలౌట్ అయింది . ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకి విండిస్ భారీ స్కోర్ చేయలేకపోయింది . విండిస్ బాట్స్ మెన్స్ లో క్రిస్ గేల్(36) ,పురాన్(63), హెట్మైర్ (39) తప్ప మరెవరు రాణించలేకపోయారు. దీనితో ఇంగ్లాండ్ మూడు విజయాలను అందుకుంది .. వెస్టిండిస్ మరో పరాజయాన్ని ముటగట్టుకుంది .. మ్యాచ్ లో అల్ రౌండర్ గా రాణించిన జో రూట్ కి మాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories