Top
logo

పాక్ కవ్వింపులు...తిప్పికొట్టిన భారత్

పాక్ కవ్వింపులు...తిప్పికొట్టిన భారత్
X
Highlights

భారత వైమానిక దళం పాక్‌ భూభాగంలోకి చొచ్చుకొని వెళ్లి భీకర దాడి చేసినా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ...

భారత వైమానిక దళం పాక్‌ భూభాగంలోకి చొచ్చుకొని వెళ్లి భీకర దాడి చేసినా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. షోపియాన్‌ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు ఈ తెల్లవారుజాము నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి,. మెమందర్ ప్రాంతంలోని సరిహద్దు గ్రామంలో ముగ్గురు ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నారని సమచారం అందుకున్న భారత భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాదికోసం వేట కొనసాగుతోంది.

భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు ఎదురు కాల్పులు జరుగుతున్న షోపియన్ జిల్లా మెమందర్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున నాలుగున్నర సమయంలో సీఆర్పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కు చెందిన పారా మిలటరీ జవాన్లు తనిఖీలు జరిపారు. తప్పించుకున్న ఉగ్రవాది కోసం గాలింపు కొనసాగుతోంది.

Next Story