గుండెలు పిండేస్తున్న ఏనుగు మాతృప్రేమ

గుండెలు పిండేస్తున్న ఏనుగు మాతృప్రేమ
x
Highlights

తమకిష్టమైన వారు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణించలేం. కానీ అలాంటి ఫీలింగ్‌ మనుషులకే కాదు మూగ జీవాలకు కూడా ఉంటుందని నిరూపించిందో ఏనుగు. ఓ ఏనుగు తన...

తమకిష్టమైన వారు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణించలేం. కానీ అలాంటి ఫీలింగ్‌ మనుషులకే కాదు మూగ జీవాలకు కూడా ఉంటుందని నిరూపించిందో ఏనుగు. ఓ ఏనుగు తన బిడ్డ చనిపోతే దాన్ని మోసుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. నేలపై పడిన పిల్లను అటూ ఇటూ కదుపుతూ కనిపించింది. ఏనుగు చనిపోయిందన్న బాధలో తల్లి ఏనుగు పిచ్చెక్కినదానిలా ప్రవర్తించింది. చివరి ప్రయత్నంగా బిడ్డను తొండంతో తట్టి లేపేందుకు ప్రయత్నించింది. ఈలోగా అక్కడికి వచ్చిన మిగతా ఏనుగులు, సంతాప సూచకంగా మౌనం పాటిస్తున్నట్టుగా ఓ నిమిషం పాటు అలాగే నిలబడ్డాయి. మృత దేహాన్ని రోడ్డుపై దించిన తల్లిఏనుగు ఆపై మృతదేహాన్ని తొండంతో పట్టుకుని అడవిలోకి తీసుకెళ్లింది . దాదాపు 20 ఏనుగుల గుంపు తొడుగా వచ్చాయి. ఈ మొత్తం దృశ్యాన్ని, ఆ దారిలో వెళుతూ ఆగిన కొందరు ప్రజలు కూడా వీక్షించారు. దీన్నంతా గమనించిన అటవీ అధికారులు దాన్ని వీడియో తీయడంతో వైరల్ గా మారింది. దాదాపు 20 ఏనుగుల గుంపు..చనిపోయిన గున్న ఏనుగుకు బాధతో కన్నీటి వీడ్కోలు పలికాయి. గుండెలు పిండేస్తున్న ఏనుగు మాతృప్రేమ పలువురిని కంటతడి పెట్టించింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories