ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్ : రికార్డు స్థాయిలో కరెంట్ వాడిన పట్నం వాసులు

ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్ :  రికార్డు స్థాయిలో కరెంట్ వాడిన పట్నం వాసులు
x
Highlights

తాజాగా ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలరోజున నగరంలో కరెంట్‌ మీటర్లు గిరగిర తిరిగాయి. అసలే ఎండాకాలం భానుడు భగభగ తోడు..మరో వైపు పార్లమెంటు,...

తాజాగా ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలరోజున నగరంలో కరెంట్‌ మీటర్లు గిరగిర తిరిగాయి. అసలే ఎండాకాలం భానుడు భగభగ తోడు..మరో వైపు పార్లమెంటు, ఏపీలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల చేసేందుకు హైదరాబాదీయులు ఎగబడ్డారు. ఆరోజులు మొత్తం ఇండ్లలోనే గడిపారు. రిజల్ట్స్‌ని చూస్తూ ఎక్కడివారు అక్కడే టీవీలకు అతుక్కుపోయారు. టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రోజంతా పనిచేస్తుండడంతో ఎన్నడూ లేని విధంగా కరెంట్ వినియోగం రికార్డు స్థాయికి చేరింది. ఎన్నడూ లేని విధంగా 68.95 మిలియన్ యూనిట్లని వాడారని టీఎస్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ తెలిపారు. వాస్తవానికి రిజల్ట్స్‌కి మూడురోజుల ముందే ఆల్‌టైమ్ రికార్డు కరెంట్ డిమాండ్ 3276 మెగవాట్లు నమోదైంది. ఇక ఈ నెలాఖరులో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో కరెంట్ వినియోగం 70 మిలియన్‌ యూనిట్లు దాటేలా కనిపిస్తోంది. ప్రజలకు కరెంటు అంతరాయాలు లేకుండా సరఫరా చేస్తామని టీఎస్పీడీసీఎల్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories