8 గంటలకు లెక్క మొదలు.. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు.. ఆ తర్వాత ఈవీఎంలు

8 గంటలకు లెక్క మొదలు.. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు.. ఆ తర్వాత ఈవీఎంలు
x
Highlights

దేశ వ్యాప్తంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి .. ఇక తెలంగాణాలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపుకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని...

దేశ వ్యాప్తంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి .. ఇక తెలంగాణాలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపుకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఎన్నికల అధికారి రజిత్ కుమార్ తెలిపారు .. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. పార్టీల ఏజెంట్ల సమక్షంలో తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను తెరుస్తాం. తిరస్కరించిన ఓట్ల కన్నా మెజార్టీ తక్కువగా ఉంటే వాటిని మళ్లీ లెక్కిస్తాం.వాటి లెక్కింపు పూర్తయ్యాక ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపడతాం. ఉదయం 8.20 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది అని అయన అన్నారు..

ఇక నిజామాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ లెక్కింపును వేగవంతం చేసేందుకు 36 టేబుళ్ల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. నిజామాబాద్‌లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంటును రెండుగా విభజించి ఒక గదిలో 18, మరో గదిలో 18 టేబుళ్లు ఏర్పాటు చేసి లెక్కింపు చేపడతాం. మల్కాజిగిరిలో 28 ఏర్పాటు చేస్తున్నాం. మిగిలిన నియోజకవర్గాల్లో 14 టేబుళ్ల ద్వారా చేపడతాం. వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించిన తరవాతే తుది ఫలితాన్ని ప్రకటిస్తారు..

ఓట్ల లెక్కింపులో ఏవైనా అభ్యంతరాలుంటే ఆయా నియోజకవర్గ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాలి. తమ కార్యాలయానికో, కేంద్ర ఎన్నికల సంఘానికో ఫిర్యాదు చేస్తే ప్రయోజనం ఉండదు. లెక్కింపు కేంద్రంలోనే ఎన్నికల అధికారి అందుబాటులో ఉంటారు. తుది ఫలితాన్ని ప్రకటించటానికి ముందు ఆ అధికారి ఓట్ల వివరాలను ప్రకటిస్తారు. రెండు నిమిషాల వ్యవధి ఇస్తారు. ఆ లోగా అభ్యంతరాలుంటే రీకౌంటింగ్‌ కోసం లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలి. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించరు. లోపలికి వెళ్లే ముందు ఏజెంట్లు అక్కడి పోలీసు అధికారుల వద్ద జమ చేయాలి. ఫొటో, వీడియో జర్నలిస్టులను గ్రూపులవారీగా ఆయా కేంద్రాల్లోకి అనుమతిస్తారు...

బ్యాలెట్‌ పత్రాలను లెక్కించినట్లుగానే వీవీప్యాట్లలోని ఓట్లను లెక్కిస్తారు. ఎంపిక చేసిన వీవీప్యాట్‌లోని ఓటు పత్రాలను బయటకు తీస్తారు. 25 చొప్పున లెక్కించి ముందుగా కట్టలుగా కడతారు. తరవాత ఆ నియోజకవర్గంలోని అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అన్ని ట్రేలు ఏర్పాటు చేస్తారు. కట్టల నుంచి ఓట్లను ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను ఆ ట్రేలో వేస్తారు. ఆదే పోలింగు నంబరు ఈవీఎంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఆ రికార్డులను సరిచేస్తారు. రెండు సరిపోలితే ఆ వీవీప్యాట్ను తిరిగి భద్రతా గదికి తరలిస్తారు. మరో వీవీప్యాట్‌ను తీసుకొచ్చి అదే తరహాలో కట్టలు కట్టి ఓట్లను లెక్కిస్తారు. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్‌లో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అక్కడ అన్ని ట్రేలను ఏర్పాటు చేస్తారు. అతి తక్కువగా మెదక్‌లో పది మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఖమ్మంలో 29 మంది పోటీలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories