రాహుకాలంలో షెడ్యూల్ ప్రకటన ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?

రాహుకాలంలో షెడ్యూల్ ప్రకటన ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?
x
Highlights

రాహుకాలంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడింది. ఇది ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..? జోతిషం, పంచాంగం విశ్వసించే తెలుగురాష్ట్రాల్లో ఇది మరింత ఆందోళన...

రాహుకాలంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడింది. ఇది ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..? జోతిషం, పంచాంగం విశ్వసించే తెలుగురాష్ట్రాల్లో ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. సెంటిమెంట్ ఫాలో అయ్యే కేసీఆర్, ముహుర్తాలు నమ్మే చంద్రబాబు నాయుడుకి రాహుకాలంలో షెడ్యూల్ ప్రకటన నష్టం కలిగిస్తుందా... లాభం చేకూరుస్తుందా..?

భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన సమయంపై సర్వత్రా టెన్షన్ పెడుతోంది. ఆదివారం సాయంత్రం 4-30 గంటల నుంచి 6 గంటల వరకు రాహు కాలం ఉండటం అదే సమయంలో సీఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో నేతలు ఆందోళనలో పడ్డారు.

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జోతిషం, పంచాంగాన్ని ఎక్కువగా నమ్ముతారు. అందులో తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువ. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి పనికి ముహుర్తం, జోతిషం, గ్రహబలాలు తప్పక చూసుకుంటారు. గత అసెంబ్లీ రద్దు, ఎన్నికల ప్రచారం, ప్రమాణస్వీకారం, మంత్రుల ప్రమాణ స్వీకారం వరకు అన్ని ముహూర్తం ప్రకారమే జరిపించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారం చేపట్టిన గులాబీ బాస్ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలను పూర్తిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించారు. కేటీఆర్ పార్లమెంట్ సన్నాహక సమావేశాలతో దూకుడు పెంచారు. ఇదే తరుణంలో తెలంగాణ పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలకావడం అది రాహుకాలంలో ఉండటం టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది. అయినా 16స్థానాల్లో గెలుపు మాదేనంటూ కొందరు టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంపై ఏపీలోనూ టెన్షన్ పుట్టిస్తోంది. సీఎం చంద్రబాబునాయుడు కూడా జోతిషం, ముహుర్తాలను నమ్ముతారు. దాని ప్రకారమే ఈమధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజు జరుగుతాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధిష్టానం దృష్టిపెట్టింది. కొన్ని జిల్లాల్లో అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు చంద్రబాబు. రాహుకాలంలో షెడ్యూల్ విడుదల కావడంపై టీడీపీ నేతల్లోను టెన్షన్ పుట్టిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories