ఇంకా తెలవారదేమీ, ఈ చీకటి విడిపోదేమీ

ఇంకా తెలవారదేమీ, ఈ చీకటి విడిపోదేమీ
x
Highlights

నెలలు.. రోజులైయ్యాయి, రోజులు.. గంటలుగా మారాయి, ఆ గంటలు కాస్తా నిమిషాలు కానున్నాయి, నరాలు తెగే ఉత్కంఠ రేపుతోన్న ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఇంకా...

నెలలు.. రోజులైయ్యాయి, రోజులు.. గంటలుగా మారాయి, ఆ గంటలు కాస్తా నిమిషాలు కానున్నాయి, నరాలు తెగే ఉత్కంఠ రేపుతోన్న ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగులున్నాయి. పది పన్నెండు గంటల్లో పార్టీల జాతకాలు తేలిపోనున్నాయి. దాంతో అభ్యర్ధుల్లో టెన్షన్ తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లూ వేచిన సమయం మరికొన్ని గంటల్లో సాక్షాత్కరించనుండటంతో ఉత్కంఠ పెరిగిపోతోంది. టెన్షన్‌ను తట్టుకోలేక ఆయా పార్టీల అధినేతలు, అభ్యర్ధులు గంటలు, నిమిషాలను లెక్కలేసుకుంటున్నారు. ఇన్ని రోజులూ ఆగినా, ఇంకా ఆగలేమంటూ కాలాన్ని భారంగా వెళ్లదీస్తున్నారు. ఇంకా తెలవారదేమీ ఈ చీకటి విడిపోదేమీ అంటూ పాటలు పాడుకుంటున్నారు. ఇన్నాళ్లూ వేచిన సమయం మరికొన్ని గంటల్లో రాబోతోంది. దాంతో పార్టీల్లో అభ్యర్ధుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. టెన్షన్‌ను అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తారాస్థాయికి చేరింది. ఎందుకంటే తొలి దశలోనే ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగడం, ఫలితాలు కోసం నెలన్నర పైగా ఆగాల్సి రావడంతో, ఇన్నిరోజులూ వేచిచూసిన అభ్యర్ధులు ఇక మిగిలివున్న ఈ కొన్ని గంటల సమయాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశలోనే అంటే ఏప్రిల్ 11నే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. తెలంగాణలో కేవలం లోక్‌సభ స్థానాలకు మాత్రమే పోలింగ్‌ జరగగా, ఏపీలో మాత్రం లోక్‌సభతోపాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. పైగా అధికారం కోసం టీడీపీ, వైసీపీలు నువ్వానేనా అంటూ హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ఫలితాల కోసం 40రోజులకు పైగా ఆగాల్సి రావడంతో రోజులన్నీ భారంగా గడిచాయి. పార్టీలు, అభ్యర్ధులకే కాదు కార్యకర్తలు, ప్రజల్లో కూడా నరాల తెగే ఉత్కంఠ పెరిగిపోయింది. చివరికి ఇన్నాళ్లూ వేచిచూసిన సమయం మరికొన్ని గంటల్లో రానుండటంతో ఈ రాత్రి కాళరాత్రిగా మారింది.

మొదట్లో పోలింగ్‌ జరిగిన 24గంటల తరువాత ఫలితాలు వచ్చేవి. ఆ తరువాత 15రోజుల గడువులో రిజల్ట్స్ వచ్చేసేవి. కానీ ఈసారి మాత్రం పోలింగ్ ముగిశాక 40రోజులకు పైగా ఎదురుచూడాల్సి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ తారాస్థాయికి చేరింది. దాంతో ఎప్పుడు తెల్లవారుతుందా అంటూ పార్టీలు, అభ్యర్ధులు, కార్యకర్తలతోపాటు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. ఉదయం 8గంటల సమయం ఎప్పుడొస్తుందోనని తీవ్ర ఉత్కంఠతో ఉడికిపోతున్నారు. నిద్రపట్టక ఇంకా తెలవారదేమీ ఈ చీకటి విడిపోదేమీ అంటూ రాత్రంతా జాగరణకు సిద్ధమవుతున్నారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం.. రేపే ఎదురవుతుంటే.. ఇన్నినాళ్ల ఈ టెన్షన్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. ఇంకా తెలవారదేమీ ఈ చీకటి విడిపోదేమీ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు, నేతలు, కార్యకర్తలు పాడుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories