మూడు దశల్లో పరిషత్ ఎన్నికలు...షెఢ్యూల్ రూపొందించిన...

మూడు దశల్లో పరిషత్ ఎన్నికలు...షెఢ్యూల్ రూపొందించిన...
x
Highlights

తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మూడు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. మే...

తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మూడు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. మే 6, 10, 14 తేదీల్లో పరిషత్ ఎన్నికలు జరుపుతామంటూ తాత్కాలిక షెడ్యూల్ రూపొందించి ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఎన్నికల నిర్వహణపై సోమవారం సీఎస్, డీజీపీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సమావేశం కానున్నారు.

రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల పోరు దిశగా అడుగులు పడుతున్నాయి. ముసాయిదా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22న తొలి నోటిఫికేషన్ వెలువడ్డాక ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు 24వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్లు పరిశీలించి అదేరోజు సాయంత్రం అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. 26న అప్పీళ్లు స్వీకరించి 27న వాటిని పరిష్కరిస్తారు. 28న 3గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. మే 6న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 26న విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు 28 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29న పరిశీలన సాయంత్రం 5గంటల తర్వాత అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. 30న అప్పీళ్లు స్వీకరించి మే 1న వాటిని పరిష్కరిస్తారు. మే 2న సాయంత్రం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. తర్వాత పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వచ్చే నెల 10న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

ఈనెల 30న తుది విడత నోటిఫికేషన్ వచ్చాక మూడు రోజులు పాటు మే 2 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 3న నామినేషన్లు పరిశీలించి సాయంత్రం అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. 4న అప్పీళ్లు స్వీకరించి 5న పరిష్కరిస్తారు. మే 6న 3గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వచ్చే నెల 14న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తుది విడత పోలింగ్ జరుగుతుంది.

బ్యాలెట్ పద్ధతిలోనే పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీటీసీలకు గులాబీ రంగు, జడ్పీటీసీలకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను వినియోగించనున్నారు. రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు ఎక్కువ సంఖ్యలో బరిలో నిలవనున్నారు. స్వతంత్ర అభ్యర్థుల కోసం 100 గుర్తులను అధికారులు అందుబాటులో ఉంచారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని సీఈసీ నిర్దేశించడంతో మే 23 తర్వాతే ఫలితాలు విడుదల కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories