ఈవీఎంపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చిన ఈసీ

ఈవీఎంపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చిన ఈసీ
x
Highlights

ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ఈవీఎంపై వస్తున్న ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. 2017, మే 20న ఈవీఎంల ఛాలెంజ్‌కు రావాలని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తే...

ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ఈవీఎంపై వస్తున్న ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. 2017, మే 20న ఈవీఎంల ఛాలెంజ్‌కు రావాలని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తే కేవలం రెండు పార్టీలు సీపీఎం, ఎన్సీపీ మాత్రమే ముందుకొచ్చాయని పేర్కొంది. ఈ రెండు పార్టీలు ఈవీఎంలను పరీక్షించి వాటి పనితీరు పట్ల పూర్తి సంతృప్తి ప్రకటించాయని తెలిపింది. ఇక అదే ఏడాది మే 12న 42 పార్టీలు ఈవీఎంలను పరిశీలించి పలు సందేహాలను నివృత్తి చేసుకున్నాయని వెల్లడించింది. భవిష్యత్‌లో వీవీప్యాట్‌లతో అనుసంధానించిన ఈవీఎంలతో ఎన్నికలు జరుపుతామని పార్టీలకు ముందుగానే సమాచారం ఇచ్చామని, ఈవీఎంలను హ్యాక్‌ చేయలేరని ఉత్తరాఖండ్‌ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిన విషయాన్ని ఈసీ గుర్తుచేసింది. గత 67 ఏళ్లుగా ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని, మరింత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఈసీ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories