మరికొద్దిసేపట్లో 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

మరికొద్దిసేపట్లో 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
x
Highlights

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగరా మోగించేందుకు ముహూర్తం ఖారారైంది. మరికొద్దిసేపట్లో 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు.దీంతో పాటు...

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగరా మోగించేందుకు ముహూర్తం ఖారారైంది. మరికొద్దిసేపట్లో 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు.దీంతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటిస్తారు. ఇప్పటికే దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటించిన ఈసీ ఎన్నికల నిర్వాహణకు చేస్తున్న ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారు. షెడ్యూల్ ప్రకటించగానే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు ఏపీలోని 175 , ఒడిశాలోని 147, అరుణాచల్ ప్రదేశ్‌లోని ి60, సిక్కింలోని 32 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. దేశ వ్యాప్తంగా పోటీకి సిద్ధమైన బీజేపీ శివసేన, ఎల్‌జేపీ, జేడీయూ వంటి పక్షాలతో పొత్తు కుదుర్చుకుంది. ఇక కాంగ్రెస్‌ కూడా మిత్రపక్షాలతో పోటీకి సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని భావించినా సాధ్యం కాలేదు. దీంతో దేశంలోని అతి పెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్‌లో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఇదే సమయంలో రాహుల్ సోదరి ప్రియాంకను ఎన్నికల ప్రచారంలో దింపడం ద్వారా ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని రగిల్చింది.

ఇక గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్‌, టీడీపీలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఈ సారి పొత్తులకు దూరంగా ఉంది. పొత్తుల చిత్తుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా అన్ని స్ధానాల్లో అభ్యర్ధులను ఖారారు చేయడం ద్వారా ఒంటరి పోరుకు సంకేతాలిస్తోంది. ఇక మమతా బెనర్జీ కూడా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో వామపక్షాలు కూడా కాంగ్రెస్‌తో పొత్తు లేదని ప్రకటించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories